India Water War: పాకిస్తాన్‌పై భారత్ వాటర్ వార్.. ఒక్కసారిగా ఆ డ్యామ్‌ల గేట్లు ఎత్తివేత..

అనూహ్యంగా ఆ డ్యామ్‌లో రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసింది భారత్.

India Water War: పాకిస్తాన్‌పై భారత్ వాటర్ వార్.. ఒక్కసారిగా ఆ డ్యామ్‌ల గేట్లు ఎత్తివేత..

Updated On : May 11, 2025 / 4:36 PM IST

India Water War: పహల్గాం ఉగ్రదాడితో భారత్ రగిలిపోతోంది. పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలకు దిగింది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత మెరుపు దాడులు చేసింది. ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా భారత్ పై దాడులకు దిగింది. వారి దాడులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పరస్పర దాడులతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలడి భారత్ డిసైడ్ అయిపోయింది. ఈ క్రమంలో పాక్ పై వాటర్ వార్ ప్రకటించింది. పాక్ కు నీరు వెళ్లకుండా పలు డ్యామ్ ల గేట్లు మూసివేసింది భారత్. అదే సమయంలో సడెన్ గా గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతోంది. ఫలితంగా పాక్ లో వరదలు వచ్చేలా ప్లాన్ చేసింది.

పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో రాంబన్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన బాగ్లిహార్ జల విద్యుత్ ప్రాజెక్ట్ గేట్లను భారత్ కొన్ని రోజుల క్రితం మూసేసింది. ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తుందనే కారణంతో పాక్ పై తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ డ్యామ్‌ గేట్లు మూసేశారు. అనూహ్యంగా ఆ డ్యామ్‌లో రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసింది భారత్. జమ్మూ కశ్మీర్‌లో భారీ వర్షపాతం కారణంగా డ్యామ్‌ నిండే అవకాశం ఉండటం, ఆ ప్రాంతంలో వరదలు సంభవించే ప్రమాదం ఉండటంతో నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నారు.

Also Read: పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్థాన్ హస్తం.. ఒక్కసారిగా చెప్పేసిన పాకిస్థాన్ అధికారి

డ్యామ్ రెండు గేట్లను ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు తెరిచి ఉంచారు. అలాగే రియాసిలోని సలాల్ డ్యామ్ పలు గేట్లను కూడా భారత్ ఎత్తింది. గేట్లు తెరవడంతో చీనాబ్‌లో నీటి మట్టాలు పెరిగాయి. భారత్, పాక్ కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ సింధు జలాల ఒప్పందం గురించి ప్రస్తావన జరగలేదు.

ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారు. 26 మంది అమాయకులను కాల్చి చంపారు. దీంతో పాక్ పై చర్యలు తీసుకుంది భారత్. ఇందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత పాక్ కు నీరు వెళ్లకుండా కొన్ని డ్యామ్ ల గేట్లు మూసివేసింది. చీనాబ్ నదిపై ఉన్న కీలకమైన జలవిద్యుత్ ప్రాజెక్ట్ బాగ్లిహార్ డ్యామ్. సింధు జలాల ఒప్పంద చట్టం ప్రకారం భారత్‌, పాక్ మధ్య గతంలో వివాదాలకు కేంద్రంగా ఉంది.