Modi Japan Tour : హిందీలో పలకరించిన జపాన్ కిడ్స్.. వావ్ అంటూ మోదీ ఫిదా.. వీడియో వైరల్..!
Modi Japan Tour : భారత ప్రధాని నరేంద్ర మోదీకి జపాన్ రాజధాని టోక్యోలో అపూర్వ ఘనస్వాగతం లభించింది. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న మోదీ.. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నాలుగు దేశాల క్వాడ్ సదస్సులో పాల్గొననున్నారు.
Modi Japan Tour : భారత ప్రధాని నరేంద్ర మోదీకి జపాన్ రాజధాని టోక్యోలో అపూర్వ ఘనస్వాగతం లభించింది. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న మోదీ.. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నాలుగు దేశాల క్వాడ్ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన టోక్యోలో ప్రవాస భారతీయుల నుంచి అపూర్వ స్పందన లభించింది. ముఖ్యంగా జపనీస్ పిల్లలు మోదీకి భారతీయ భాషల్లో ఘనస్వాగతం పలికారు. టోక్యోలోని న్యూఒటానీ హోటల్ వద్ద ప్రధాని మోదీ బస చేశారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న జపనీస్ పిల్లలు సందడి చేశారు. జపనీస్ పిల్లలు చాలామంది మోదీతో హిందీలో చక్కగా మాట్లాడారు. వారి మాటలకు మోదీ ముగ్ధుడయ్యారు.
#WATCH | “Waah! Where did you learn Hindi from?… You know it pretty well?,” PM Modi to Japanese kids who were awaiting his autograph with Indian kids on his arrival at a hotel in Tokyo, Japan pic.twitter.com/xbNRlSUjik
— ANI (@ANI) May 22, 2022
వావ్.. హిందీ ఎక్కడ నేర్చుకున్నావ్.. అంటూ జపనీస్ పిల్లాడితో మోదీ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు పిల్లలు హిందీలోనే మోదీతో సంభాషించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో డ్రాగన్ చైనాను నిలువరించడంతో పాటు రక్షణ, వ్యాపార, దౌత్య సంబంధాలను బలోపేతానికి భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా ‘క్వాడ్ కూటమి’గా ఏర్పాటుచేసిన ఈ ఏడాది సదస్సుకు భారత ప్రధాని జపాన్లో పర్యటిస్తున్నారు.
#WATCH | “…Can’t speak Hindi much, but I understand…PM read my message, and I also got his signature, so I am very happy…,” said grade 5 student Wizuki on his interaction with PM Modi in Tokyo, Japan pic.twitter.com/1V3RjnpQQF
— ANI (@ANI) May 23, 2022
ఈ సందర్భంగా టోక్యో ఎయిర్ పోర్టులో మోదీకి అధికారిక, సైనిక స్వాగతం లభించింది. మోదీ హోటల్ వద్దకు చేరుకోగానే.. భారీ సంఖ్యలో ప్రవాసభారతీయులు అక్కడికి చేరుకుని మోదీ.. మోదీ.. అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. హర్ హర్ మోదీ.. వందేమాతరం.. భారత్ మాతాకీ జై.. నినాదాలతో మారుమోగిపోయింది.
#WATCH | Amid chants, Prime Minister Narendra Modi receives a warm welcome from the Indian diaspora in Tokyo, Japan
He will be participating in Quad Leaders’ Summit as part of his 2-day tour starting today, May 23. pic.twitter.com/Owqx1GXksm
— ANI (@ANI) May 22, 2022
Read Also : Quad summit 2022: PM Modi : ప్రధాని మోడీ జపాన్ పర్యటనపైనే ప్రపంచ దేశాల దృష్టి.. ఎందుకంటే..