Ukraine President: మేం ఇక్కడే ఉన్నాం.. వీడియోలో యుక్రెయిన్ ప్రెసిడెంట్
యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వీడియోను రిలీజ్ చేశారు. తనతో పాటు Kyivను కాపాడుకునేందుకు నిల్చొన్న ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి సెల్ఫీ వీడియోలో...

Ukraine President
Ukraine President: యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వీడియోను రిలీజ్ చేశారు. తనతో పాటు Kyivను కాపాడుకునేందుకు నిల్చొన్న ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి సెల్ఫీ వీడియోలో కనిపించాడు. సెంట్రల్ Kyiv నుంచి తీసుకున్న వీడియోతో ఉక్రెయిన్ నుంచి పారిపోతున్నాడంటూ జరిగిన పుకార్లకు చెక్ పెట్టాడు.
‘మేమంతా ఇక్కడే ఉన్నాం. మా మిలటరీ ఇక్కడే ఉంది. సమాజంలో పౌరులు ఇక్కడే ఉన్నారు. మా స్వాతంత్ర్యాన్ని కాపాడుకునేందుకు ఇక్కడే ఉన్నాం. ఇలాగే ఉంటాం’ అని చెప్పారు ప్రెసిడెంట్. ఆ వీడియోలో ప్రెసిడెంట్, చీఫ్ స్టాఫ్, ఇతర సీనియర్ అధికారులు ప్రెసిడెన్సీ బిల్డింగ్ బయట కనిపించారు.
‘ప్రెసిడెంట్ పుతిన్, మినిష్టర్ లారోవ్ ఈ చర్యలకు బాధ్యులు. కిమ్ జంగ్ ఉన్, అలెగ్జాండర్ ల్యూకాషెంకో, బషర్ అల్ అస్సద్ లు కలిసి పుతిన్ ఓ చిన్న గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు’ అంటూ నార్త్ కొరియా, సిరియా, బెలారస్ లను ప్రస్తావించి యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఓ స్టేట్మెంట్ లో చెప్పింది.
Read Also: మరింత భీకరంగా వార్.. కీవ్, ఖర్కిన్ లోకి ప్రవేశించిన రష్యా బలగాలు
రొమేనియా నుంచి రెండు ఎయిర్ ఇండియా విమానాలు భారత్ బయలుదేరాయి. ఇప్పటికే రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ఢిల్లీ, ముంబైలకు విమానాలు బయల్దేరాయి. ఉదయం 10.30 గంటలకు ఎఐ 1942 విమానం ఢిల్లీ చేరుకోనుంది. మరో ఎఐ 1944 విమానం మధ్యాహ్నం ముంబైకు చేరుకోనుంది.
ముందుగా భారతీయులను యుక్రెయిన్ సరిహద్దులైన రొమేనియా, హంగరీ ప్రాంతాలకు తరలించారు. వాళ్లంతా రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకున్నాక ఎయిరిండియా విమానాల్లో భారత్‌కు బయల్దేరారు.
Read Also : రష్యా-యుక్రెయిన్ పేలుళ్ల మధ్య.. పెళ్లి ప్రమాణాలతో ఒక్కటైన జంట..!