Norma Edwards (Image Credit To Original Source)
Norma Edwards: గుండె ఆగిపోతుంది, రక్త ప్రసరణ జరగదు, శరీరంలోకి ఏ భాగమూ కదలదు, శ్వాస తీసుకోలేం, మాటలు పలకలేం.. దీన్నే చనిపోవడం అని అంటారు. అయితే, మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అన్న ప్రశ్నకు శాస్త్రీయంగా సమాధానం లేదు.
చావు అంచుల వరకు వెళ్లివచ్చిన కొందరు మరణానికి సంబంధించిన కొన్ని విషయాలను చెబుతుంటారు. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన నార్మా ఎడ్వర్డ్స్ (80) అనే పాస్టర్ మూడు సార్లు చనిపోయి, మళ్లీ బతికారట. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఆమె చెబుతున్నారు.
నార్మా ఎడ్వర్డ్స్ తన గురించి తాను చెప్పుకున్న వివరాల ప్రకారం.. ఆమెకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మృతువు తొలిసారి పలకరించింది. నార్మా ఎడ్వర్డ్స్ ఉద్యోగానికి వెళ్తున్న సమయంలో గుండె ఆగిపోయి కుప్పకూలిపోయింది. ఆమె కడుపులో చనిపోయిన పిండం ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో ఆమె రక్తం విషమయం అయిపోందని చెప్పారు.
ఒక్కసారిగా తన దేహాన్ని వదిలి తాను వెళ్లిపోతున్నట్లు అనిపించిందని, ఆపరేషన్ టేబుల్ పైన ఉన్న పైకప్పు దగ్గర నుంచి తన ఆత్మ శరీరాన్ని చూస్తున్న భావన వచ్చిందని నార్మా తెలిపింది. ఆ సమయంలో అన్ని నొప్పులు పూర్తిగా మాయమయ్యాయని చెప్పింది.
Also Read: ఏలియన్స్ ఉన్నాయా? అంతరిక్షంలో ఎక్కడైనా జీవం ఉందా? కుండ బద్దలుకొట్టినట్లు చెప్పేసిన సునితా విలియమ్స్
తెల్లటి వెలుతురు ఉన్న చోటుకి వెళ్లా..
చనిపోయాక ఒక డార్క్ టన్నెల్ గుండా తాను అసాధారణ వేగంతో ప్రయాణించానని, వర్ణనకు కూడా అందని బాగా తెల్లటి వెలుతురు ఉన్న చోటుకి వెళ్లానని నార్మా తెలిపారు. అక్కడ ఓ పెద్ద స్క్రీన్ కనపడిందని, అందులో తన జీవితం మూడు కాలమ్‌లలో కనపడిందని అన్నారు.
తాను పుట్టకముందే తన జీవితం ఎలా ప్లాన్ చేసి ఉందో మొదటి కాలమ్‌లో కనపడిందని నార్మా చెప్పుకొచ్చారు. తాను నిజంగా ఎలా జీవించానో రెండో కాలమ్‌లో డిస్‌ప్లే అయిందని చెప్పారు. ఇక మూడో కాలమ్‌లో “లక్ష్యం నెరవేరలేదు” అని ఉందని అన్నారు.
అదే సమయంలో మరణించిన తన ఆంటీ ఒకరు తనకు ఎదురయ్యారని నార్మా తెలిపారు. తనను తాకవద్దని ఆంటీ హెచ్చరించి, ఒక సందేశాన్ని ఇచ్చిందని అన్నారు. జీవితం శాశ్వతమని, మరణం అంతం కాదని చెప్పారని తెలిపారు.
ఆ తర్వాత తన దేహంలోకి తాను వచ్చేశానని, అది ఎంతో బాధతో కూడుకున్నదని నార్మా అన్నారు. అది ఎలా ఉందంటే.. ఒక విశాలమైన గెలాక్సీని టీ కప్పులో నింపే ప్రయత్నంలా ఉందని వివరించారు. తన ఆత్మ తన భౌతిక శరీరం కంటే చాలా పెద్దగా ఉందని అనిపించిందని చెప్పారు.
చనిపోయి, బతికిన తర్వాత వచ్చిన మార్పులు
ఈ అనుభవం తర్వాత తన ఇంద్రియాలు అసాధారణంగా పదునెక్కాయని నార్మా చెబుతున్నారు. తాను మనుషుల శరీరాల లోపలివరకు చూడగలిగినట్టు అనిపించేదని, కొన్ని సందర్భాల్లో తాను దగ్గరకు వెళ్లగానే విద్యుత్ బల్బులు పగిలిపోయేవని చెప్పారు.
2024లో 2 సార్లు చనిపోయా..
నార్మా 2024లో నవంబర్‌లో రెండు సార్లు చనిపోయిన అనుభవాలు కలిగాయని అన్నారు. తనకు కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని, అంబులెన్స్‌లో తరలిస్తున్న సమయంలో తాను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని చెప్పారు.
ఈ సారి ఒక దేవ కన్య తనకు మార్గనిర్దేశం చేసిందని నార్మా అన్నారు. భూమిపై తన మిషన్ ఇంకా పూర్తికాలేదని, తన లక్ష్యంలో సగ భాగం ఇంకా మిగిలి ఉందని తనకు చెప్పిందని తెలిపారు. తాను మళ్లీ బతికానని అన్నారు.
మరణ భయాన్ని తొలగించేందుకు నార్మా మిషన్
మనుషుల్లో మరణ భయాన్ని అధిగమించేందుకు సాయం చేయాలన్న స్పష్టమైన ఆదేశంతో తనను దేవదూతలు తిరిగి పంపారని నార్మా చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె వృద్ధులతో, జీవిత చరమాంకంలో ఉన్నవారితో పనిచేస్తూ, వారికి ధైర్యం చెబుతున్నారు.
ఇప్పుడు తనకు మరణంపై ఎలాంటి భయం లేదని నార్మా అంటున్నారు. మరణాన్ని ఆమె ఒక ముగింపుగా కాకుండా, ఒక మార్పుగా భావిస్తున్నారు. శ్వాస ఉన్నంతకాలం మనిషి వద్ద ఉన్న గొప్ప వరం జీవితమే అని ఆమె నమ్మకం.