Tiktok Chroming Challenge : 11ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన డేంజరస్ టిక్‌టాక్ ‘క్రోమింగ్’ ఛాలెంజ్ ట్రెండ్.. అసలు ఇదేంటి?!

Tiktok Chroming Challenge : క్రోమింగ్.. అనేది అత్యంత ప్రమాదకరమైన గేమ్.. వరల్డ్ లేటెస్ట్ సోషల్ మీడియా ట్రెండ్ ఇది.. టిక్‌‌టాక్‌లో ఈ క్రేజీ గేమ్ ద్వారా పిల్లలు ప్రమాదకరమైన గృహ రసాయనాలతో ఆటలాడతారు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం.

What Is Chroming, Latest Social Media Trend That Killed 11-Year-Old Boy

Tiktok Chroming Challenge : ఆన్‌లైన్ గేమ్స్ అంటే పిల్లలు ఎంత ఇష్టపడతారో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. పబ్జీ, టిక్‌టాక్ వంటి డేంజరస్ ఛాలెంజ్ గేమ్స్ పట్ల పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అందుకే ఇలాంటి గేమ్స్ భారత్ సహా పలు దేశ ప్రభుత్వాలు నిషేధించాయి. అయినప్పటికీ కొన్ని దేశాల్లో ఇలాంటి ప్రాణాంతక గేమ్స్ యాక్సస్ కారణంగా అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు.

Read Also : Rare Transplant Surgery : అత్యంత అరుదైన సర్జరీ.. రైలు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన వ్యక్తికి తిరిగి అమర్చిన వైద్యులు..!

తాజాగా యూకేలో టామీ-లీ గ్రేసీ బిల్లింగ్టన్ అనే 11ఏళ్ల బాలుడు స్నేహితుని ఇంట్లో ‘క్రోమింగ్’ ఛాలెంజ్‌ను ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి అమ్మమ్మ మాట్లాడుతూ.. ‘స్నేహితుడి ఇంట్లో నిద్రపోయిన వెంటనే టామీ మరణించాడు. పిల్లలు ‘క్రోమింగ్’ టిక్ టాక్ క్రేజ్‌ ఛాలెంజ్ గేమ్ ప్రయత్నించారు. టామీ-లీ వెంటనే గుండెపోటుకు గురయ్యాడు. అక్కడిక్కడే మరణించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది’ అని బోరున ఏడ్చేసింది.

అసలు క్రోమింగ్ అంటే ఏంటి? :
ఇలాంటి ఘటనలు గతంలోనే అనేకం చోటుచేసుకున్నాయి. పిల్లలు డేంజరస్ గేమ్స్ పట్ల ఆకర్షితులై తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు పిల్లల ప్రాణాలు బలిగొంటున్న ఈ ‘క్రోమింగ్’ ఛాలెంజ్ అంటే ఏంటి? టిక్‌టాక్‌లో లేటెస్ట్ ట్రెండ్ కారణంగా పిల్లల మానసిక స్థితి ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనే ప్రశ్నలకు రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ వివరణ ఇచ్చింది.

టిక్‌టాక్‌లో ఈ ట్రెండీ గేమ్ ప్రాణాంతకం :
క్రోమింగ్ అనేది.. ప్రమాదకరమైన ఆట.. టిక్‌టాక్‌లో లేటెస్ట్ క్రేజీ గేమ్ ఛాలెంజ్ అని పిలుస్తారు. ఈ గేమ్ ఛాలెంజ్ ఆడే వారు కొన్ని యాక్టివిటీలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా ప్రమాదకరమైన గృహ రసాయనాలైన నెయిల్ పాలిష్ రిమూవర్, హెయిర్‌స్ప్రే, ఏరోసోల్ డియోడరెంట్, లైటర్ ఫ్లూయిడ్, గ్యాసోలిన్, పెయింట్ థిన్నర్స్, స్ప్రే పెయింట్, పర్మినంట్ మార్కర్స్ వంటి పదార్థాలను ముక్కు ద్వారా పీల్చాల్సి ఉంటుంది. ఈ రసాయాలను పీల్చినప్పుడు ఒకరకమైన మత్తును కలిగిస్తుంది. సాధారణంగా డ్రగ్స్ వాడేవారిలో కలిగే మత్తు లాంటిదిగా చెప్పవచ్చు.

ఈ రకమైన మాదకద్రవ్యాల వినియోగంలో పిల్లల్లో మానసిక పరమైన గందరగోళాన్ని సృష్టిస్తుంది. అందుకే, పిల్లలు తొందరగా దీనికి అడిక్ట్ అవుతారు. మళ్లీ మళ్లీ ఇదే గేమ్ ఆడేందుకు ప్రేరేపిస్తుంది. అమెరికన్ అడిక్షన్ సెంటర్స్ ప్రకారం. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఈ ఛాలెంజ్ స్వీకరించిన పిల్లల్లో ముందుగా మైకము, వాంతులు, గుండె స్తంభించడం, మెదడు దెబ్బతినడం వంటి ప్రతికూల ప్రభావాలకు దారితీయవచ్చు.

మానసిక రుగ్మతలకు దారితీస్తుంది :
ఈ కెమికల్స్ మిశ్రమాన్ని పీల్చినప్పుడు.. ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలవడం ద్వారా వివిధ అవయవాలపై తీవ్రప్రభావం చూపుతాయి. ప్రతిరోజూ ఇలాంటి రసాయాలను పీల్చడం ద్వారా తీవ్ర మానసిక ఒత్తిడి, బలహీనత, తీవ్రమైన అలసట వంటివి ఉంటాయి.

ఆస్ట్రేలియాలోని ఆల్కహాల్ అండ్ డ్రగ్ ఫౌండేషన్ ప్రకారం.. రెగ్యులర్ ఇన్‌హేలెంట్ వాడకం డిప్రెషన్, ఆందోళన, ఇతర అనేక అనారోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. ఇన్హేలెంట్లు నేరుగా ఈ రుగ్మతలకు కారణం కాకపోవచ్చు. కానీ, అధిక వినియోగం ఇలాంటి మానసిక రుగ్మతలను తీవ్రతరం చేయవచ్చు. అదనంగా, ఆల్కహాల్ అండ్ డ్రగ్ ఫౌండేషన్ ప్రకారం.. ఇన్హేలెంట్లను క్రమం తప్పకుండా ఉపయోగించే వ్యక్తులు ఒత్తిడితో కూడిన సమస్యలను అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇన్‌హేలెట్ల దీర్ఘకాల వాడకం హానికరం :
2018 అధ్యయనం ప్రకారం.. ఈ విషపూరిత ఇన్‌హేలెంట్‌లకు దీర్ఘకాలికంగా వాడటం ద్వారా జ్ఞాపకశక్తి కోల్పోతారు. ఐక్యూ లోపిస్తుంది. ఏకాగ్రత కోల్పోతారు. మరో మాటలో చెప్పాలంటే.. క్రోమింగ్ అనేది నైట్రస్ ఆక్సైడ్‌తో నిండిన కాట్రిడ్జ్‌లను సూచిస్తుంది. ఉదాహరణకు.. లాఫింగ్ గ్యాస్ లేదా హిప్పీ క్రాక్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఈ కాట్రిడ్జ్‌లను బెలూన్‌లను నింపడానికి చట్టబద్ధంగా ఉపయోగిస్తున్నారు. అంతేకానీ, పిల్లలు ఆడుకునే గేమ్స్ వస్తువుల్లో వాడటం చట్టవిరుద్ధం. మాదక ద్రవ్యాల వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

2017 జాతీయ సర్వే నివేదిక ప్రకారం.. 2015లో 12ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయస్సు గల సుమారు 6లక్షల 84వేల మంది చిన్నారులు విషపూరిత రసాయనాలను పీల్చుతున్నారని తేలింది. మొత్తం 1.8 మిలియన్ల మందిలో 12ఏళ్ల పిల్లల నుంచి వృద్ధులు వరకు ఉన్నారని నివేదిక పేర్కొంది. ప్రతి ఐదుగురిలో ఒకరు ఎనిమిదో తరగతి నాటికి ఇన్‌హేలెంట్‌లను అధిక సంఖ్యలో ఉపయోగించారని డీఈఏ వెల్లడించింది.

Read Also : Sai Pallavi : జపాన్ పబ్‌లో సాయి పల్లవి డాన్స్.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు