Sai Pallavi : జపాన్ పబ్‌లో సాయి పల్లవి డాన్స్.. వీడియో వైరల్

జపాన్ పబ్‌లో అమీర్ ఖాన్ కొడుకుతో సాయి పల్లవి డాన్స్. వైరల్ అవుతున్న వీడియో.

Sai Pallavi : జపాన్ పబ్‌లో సాయి పల్లవి డాన్స్.. వీడియో వైరల్

Sai Pallavi dance in Japan Pub with Aamir Khan son Junaid Khan movie team

Sai Pallavi : మలయాళ సినిమాలతో స్టార్ట్ అయిన సాయి పల్లవి యాక్టింగ్ కెరీర్.. ఇప్పుడు బాలీవుడ్ కి కూడా చేరింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకి ‘ఏక్ దిన్’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జపాన్ లో జరుగుతుంది. అక్కడి షూటింగ్ కి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ మూవీ యూనిట్ అంతా కలిసి అక్కడి పబ్ లో ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలు హిందీ సూపర్ హిట్ సాంగ్స్ కి మూవీ యూనిట్ అంతా కలిసి డాన్స్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే సాయి పల్లవి కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ వేసిన డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.

Also read : Aadujeevitham Trailer : పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ ట్రైలర్ రిలీజ్..

జపాన్ లోని ఈ షెడ్యూల్ పూర్తి అయ్యిందని, అందుకనే మూవీ టీం సెలబ్రేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ మూవీ లవ్ స్టోరీ నేపథ్యంతో తెరకెక్కుతోందని సమాచారం. ఇక ఈ సినిమా తరువాత సాయి పల్లవి మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా సైన్ చేసినట్లు సమాచారం. బాలీవుడ్‌ డైరెక్టర్ నితీశ్ తివారీ రూపొందిస్తున్న రామయంల్లో సాయి పల్లవి సీతగా కనిపించబోతుందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.

రణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో రాముడిగా నటిస్తుంటే, యశ్ రావణుడిగా కనిపించబోతున్నారని టాక్. త్వరలోనే ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. ఇక తెలుగులో నాగచైతన్యతో ‘తండేల్’ సినిమా చేస్తున్నారు. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది. అలాగే తమిళంలో శివ కార్తికేయన్ తో ‘అమరన్’ అనే సినిమా చేస్తున్నారు.