Aadujeevitham Trailer : పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ ట్రైలర్ రిలీజ్..
పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఆడుజీవితం ది గోట్ లైఫ్' ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Prithviraj Sukumaran Aadujeevitham The Goat Life Official Trailer released
Aadujeevitham Trailer : మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇటీవలే ప్రభాస్ ‘సలార్’ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు వచ్చి సందడి చేశారు. ఇప్పుడు తానే హీరోగా ఓ పాన్ ఇండియా మూవీని తీసుకు వస్తున్నారు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్.. సలార్ షూటింగ్ ని పోస్టుపోన్ చేశారు. రియల్ ఇన్సిడెంట్స్ నేపథ్యంతో సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని ‘ఆడుజీవితం’ టైటిల్ తో తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.
ఆల్రెడీ గతంలోనే ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేయగా.. ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ సినిమా కథ ఏంటంటే.. కేరళకి సంబంధించిన హీరో ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకి వెళ్తాడు. అయితే అక్కడి వారు తనని ఒక బానిసగా చూస్తూ, ఎన్నో సమస్యలు పెడుతుంటారు. దీంతో అక్కడి నుంచి ఇండియాకి తిరిగి వెళ్ళిపోదాం నిర్ణయించుకొని నడక ప్రయాణం మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలో హీరో ఎలాంటి సమస్యలని ఎదురుకున్నాడు, ఇండియా చేరుకున్నాడా? లేదా? అన్నదే సినిమా కథ.
Also read : Meera Chopra : 40 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోబోతున్న ‘బంగారం’ హీరోయిన్.. ఎప్పుడంటే? వరుడు ఎవరు?
గతంలో ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన మూవీ ‘లైఫ్ ఆఫ్ పై’. ఇప్పుడు ఈ చిత్రం కూడా అలాగే థ్రిల్లర్ చేయనుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. నేషనల్ అవార్డు విన్నర్ బ్లెస్సీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మార్చి 28న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.