Meera Chopra : 40 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోబోతున్న ‘బంగారం’ హీరోయిన్.. ఎప్పుడంటే? వరుడు ఎవరు?
మీరాచోప్రా పెళ్లిపీటలు ఎక్కబోతుంది.

Actress Meera Chopra Ready to Marry Full Wedding Details Here
Meera Chopra : తెలుగులో బంగారం, వాన.. లాంటి పలు సినిమాలతో మెప్పించిన మీరాచోప్రా ఆ తర్వాత హిందీ, తమిళ్ లో వరుస సినిమాలు చేసింది. గత కొన్నాళ్లుగా హిందీలోనే అడపాదడపా సినిమాలు, సిరీస్ లు చేస్తూ వస్తుంది. ఇప్పుడు మీరాచోప్రా పెళ్లిపీటలు ఎక్కబోతుంది. ముంబైకి చెందిన రక్షిత్ అనే వ్యాపారవేత్తతో మీరాచోప్రా గత మూడేళ్ళుగా ప్రేమలో ఉందని సమాచారం. ఈ ప్రేమ ఇప్పుడు పెళ్లిగా మారబోతుంది. అయితే రక్షిత్ ఫోటో మాత్రం ఎక్కడా బయటకి రానివ్వలేదు.
మీరా చోప్రా రక్షిత్ జంట ఘనంగా రెండు రోజుల పాటు పెళ్లి వేడుకలు చేసుకోనున్నారు. జైపూర్ లోని బ్యూనా విస్తా లగ్జరీ గార్డెన్ రిసార్ట్స్ లో వీరి పెళ్లి వేడుకలు జరగనున్నాయి. మార్చ్ 11న ఉదయం మెహందీ ఫంక్షన్, సాయంత్రం సంగీత్ జరగనుంది. మార్చ్ 12 ఉదయం హల్దీ. సాయంత్రం పెళ్లి, రాత్రికి రిసెప్షన్ జరగనుంది. కేవలం కుటుంబసభ్యులు, పలువురు బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగనుంది.
Also Read : Gaami : ‘గామి’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? అదరగొట్టిన విశ్వక్..
మీరా చోప్రా కజిన్, స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ పెళ్ళికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. మీరాచోప్రా వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి వేడుక అనంతరం త్వరలో ముంబైలో బాలీవుడ్, బిజినెస్ వ్యక్తులకు సపరేట్ గా ఈవెంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.