WHO approves Sinopharm: చైనా నుంచి మరో వ్యాక్సిన్‌కు WHO అప్రూవల్.. ఎమర్జెన్సీకి మాత్రమే

చైనాకు పెద్ద ఉపశమనమే లభించినట్లు అయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శుక్రవారం సినోఫార్మ్ కొవిడ్-19కు అప్రూవల్ ఇచ్చింది. పలు దేశాల్లో..

WHO approves Sinopharm: చైనా నుంచి మరో వ్యాక్సిన్‌కు WHO అప్రూవల్.. ఎమర్జెన్సీకి మాత్రమే

Who China

Updated On : May 8, 2021 / 9:46 AM IST

WHO approves Sinopharm: చైనాకు పెద్ద ఉపశమనమే లభించినట్లు అయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శుక్రవారం సినోఫార్మ్ కొవిడ్-19కు అప్రూవల్ ఇచ్చింది. పలు దేశాల్లో కరోనావ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సినోఫార్మ్ కొవిడ్ 19 వ్యాక్సిన్ ను ఎమర్జెన్సీ సందర్భాల్లో వాడాలి. చైనా ఇలాంటి ఎమర్జెన్సీ వ్యాక్సిన్లు ఐదింటిని అప్రూవ్ చేసింది.

సినోఫార్మ్ వ్యాక్సిన్ ను 45దేశాల్లో పెద్ద వారికి వేసేందుకు ఆథరైజేషన్ దక్కించుకుంది. కానీ, చాలా దేశాలు WHO అప్రూవల్ పొందలేదని నిరాకరించాయి. WHO నుంచి ఫైజర్, ఆస్ట్రాజెనెకా, సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జాన్సెన్ వ్యాక్సిన్ ఫర్ ఎమర్జెన్సీ యూజ్లకు మాత్రమే ఆమోదం దక్కగా.. చైనీస్ వ్యాక్సిన్కు మాత్రం కాస్త లేట్ అయ్యింది.

చైనా తమ వ్యాక్సిన్ ను పలు దేశాలకు పంపించేందుకు ఆతురతగా ఎదురుచూసింది. ఈ మేరకు జెనీవాలో డబ్ల్యూహెచ్ఓ సినోఫామ్ కొవిడ్ 19కు ఎమర్జెన్సీ అప్రూవల్ దక్కిందని ప్రెస్ రిలీజ్ లో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు చైనీస్ వ్యాక్సిన్ కు ఆమెదం లభించింది.

సినోఫార్మ్ వ్యాక్సిన్ బీజింగ్ బయో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ కో లిమిటెడ్ తయారుచేసింది. సాధారణ ఉష్ణోగ్రత వద్దనే నిల్వ చేసుకోవచ్చు. రెండు డోసులలో తీసుకునే ఈ వ్యాక్సిన్.. ఎండలో ఉంచితే రంగు మారిపోతుంది.