Ivan Vladimirovich Putin : ఇవాన్ వ్లాదిమిరోవిచ్ ఎవరు? పుతిన్ ‘అజ్ఞాత కొడుకు’ ఇతడేనా? ఫొటో లీక్.. ఫస్ట్ టైం ప్రపంచానికి కనిపించాడు!

Ivan Vladimirovich Putin : 10 ఏళ్ల ఇవాన్ వ్లాదిమిరోవిచ్ పుతిన్.. వ్లాదిమిర్ పుతిన్, ఆయన మాజీ స్నేహితురాలు అలీనా కబెవా దంపతుల కుమారుడు అని సమాచారం. భారీ భద్రత ఉన్న ప్యాలెస్‌లో నివసిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

Ivan Vladimirovich Putin

Ivan Vladimirovich Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘అజ్ఞాత కొడుకు’ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన వారంతా పుతిన్ కొడుకు అని అంటున్నారు. మిర్రర్ రిపోర్టు ప్రకారం.. వ్లాదిమిర్ పుతిన్ కుమారుడు, 10 ఏళ్ల ఇవాన్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ మొదటి ఫోటో లీక్ అయింది.

ఈ ఫొటోను రష్యన్ యాంటీ-క్రెమ్లిన్ టెలిగ్రామ్ ఛానల్ (VChK-OGPU) ఛానల్ షేర్ చేసినట్లు తెలుస్తోంది. జిమ్నాస్ట్ అలీనా కబేవాతో పుతిన్ రిలేషన్ ఆరోపణల నేపథ్యంలో ఆ బాలుడిని సాధారణ రష్యన్లకు కనిపించకుండా రహస్యంగా ఉంచారని అవుట్‌లెట్ పేర్కొంది.

Read Also : Samsung Galaxy S24 Ultra 5G : అమెజాన్ బంపర్ ఆఫర్.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్‌పై రూ.31,533 వరకు తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేయొద్దు..!

పుతిన్ అజ్ఞాత కొడుకు ఎవరంటే? :
పుతిన్ కుమారుడి పేరు ‘ఇవాన్ వ్లాదిమిరోవిచ్ పుతిన్’ అని కూడా నివేదిక తెలిపింది. ఈ బాలుడు ఇతర పిల్లలతో అరుదుగా మాట్లాడుతాడు. తన సమయమంతా గార్డులు, గవర్నెస్‌లు, ఉపాధ్యాయులతో గడుపుతాడు. లీక్ అయిన ఫోటోలోని బాలుడు యువ పుతిన్‌ను పోలి ఉన్నాడని అవుట్‌లెట్ నివేదించింది. ఇవాన్ అత్యంత భద్రత కలిగిన రాజభవనంలో నివసిస్తున్నాడని నివేదించింది.

రష్యా అధ్యక్షుడికి ఇద్దరు కుమార్తెలు :
బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం.. పుతిన్‌కు మాజీ భార్య లియుడ్మిలా ష్క్రెబ్నెవా ద్వారా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెల వయస్సు దాదాపు 30 ఏళ్లు ఉంటుందని చెబుతున్నారు. మరియా 1985లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జన్మించారు. కాథరినా 1986లో జర్మనీలో జన్మించారు.

పుతిన్ అధికారిక వెబ్‌సైట్‌లోని కుమార్తె ష్క్రెబ్నెవా రాసిన ఒక కోట్ ప్రకారం.. ఆయన మంచి తండ్రిగా పేర్కొన్నట్టుగా అవుట్‌లెట్ నివేదించింది. అంతేకాదు.. “అందరు తండ్రులు తమ పిల్లలను ఆయనలాగా ప్రేమగా చూసుకోరు” అని ష్క్రెబ్నెవా పేర్కొన్నారు. అతను ఎల్లప్పుడూ వారిని ముద్దు చేస్తుంటాడు. అయితే, నేను వారిని క్రమశిక్షణలో పెట్టాల్సి వచ్చింది’ ఆమె నోట్‌లో తెలిపారు.

పుతిన్ కుమార్తెలు తప్పుడు గుర్తింపులతో యూనివర్శిటీల్లో చదువుకున్నారు. మరియా బయాలజీ చదవగా, కత్రినా ఆసియా స్టడీస్‌‌లో డిగ్రీ పొందింది. నివేదిక ప్రకారం.. మరియా మెడికల్ రీసెర్చర్‌గా పనిచేస్తుందని, కత్రినా టెక్ ఎగ్జిక్యూటివ్‌గా ఉండటమే కాకుండా మంచి నృత్యకారిణిగా పేర్కొంది.

Read Also : Google Pixel 9 : ఆఫర్ అదిరింది అబ్బా.. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9పై భారీ తగ్గింపు.. తక్కువ ధరలో ఈ డీల్ మళ్లీ రాదు!

వ్లాదిమిర్ పుతిన్‌ కుమారుడిగా పుకార్లు :
రష్యన్ నేతకు మాజీ ప్రేయసి, మాజీ రష్యన్ రిథమిక్ జిమ్నాస్ట్ అలీనా కబేవాతో ఇద్దరు పిల్లలు ఉన్నారని పుకారు ఉంది. వారిలో ఒకరే ఇవాన్ వ్లాదిమిరోవిచ్ పుతిన్.. మరొకరు వ్లాదిమిర్ జూనియర్.

బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. ఆయన కుమారులు పుతిన్ అత్యంత రక్షణాత్మక వాల్డై ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. పుతిన్‌కు మరో కుమార్తె ఉందని, మాజీ క్లీనింగ్ లేడీ స్వెత్లానా క్రివోనోగిఖ్‌తో ఆయనకు మధ్య రిలేషన్ కారణంగా జన్మించిందని ఆరోపణలు ఉన్నాయి.