కమలా హారిస్ ఎవరు ? వైస్‌ ప్రెసిడెంట్‌ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు

Who is Kamala Harris : అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌గా కమలా హారిస్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఓ మహిళ వైస్‌ ప్రెసిడెంట్‌ కావడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. కమల కుటుంబ మూలాలు భారత్‌తో ముడిపడి ఉండటం మనకూ గర్వకారణం. కమలా హారిస్‌ అసలు పేరు కమలా దేవి హారిస్‌. కమల తల్లి శ్యామలా గోపాలన్ హారిస్ తమిళనాడులో జన్మించారు. తండ్రి డోనాల్డ్‌ హారిస్‌ జమైకాలో పుట్టారు. వీరిద్దరికి కమలా హారిస్‌ 1964 ఆక్టోబర్‌ 20వ తేదీన కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో జన్మించారు. కమల చిన్నతనంలో తరుచూ తన తల్లి స్వగ్రామమైన చెన్నైకి వెళ్తుండేవారు. ఇండియన్‌ సివిల్‌ సర్వెంట్‌గా నిస్వార్థంగా పనిచేసిన తన తాత పి.వి. గోపాలన్‌ ప్రభావం తనపై ఉందని కమల చెబుతూ ఉంటుంది. తాజాగా అమెరికాలో జరిగిన ఎన్నికల్లో జో బైడెన్‌ అధ్యక్షునిగా ఎన్నికవ్వగా.. ఉపాధ్యాక్షురాలిగా కమలా హారిస్‌ ఎన్నికైంది. అంతేకాకుండా అమెరికా చరిత్రలో వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి ఎన్నికైన తొలి మహిళ ఆమె. ఆ పదవి చేపట్టే తొలి నల్లజాతి, తొలి ఆసియన్ అమెరికన్ కూడా కమలానే కావడం విశేషం.

హోవర్డ్ యూనివర్సిటి నుంచి గ్రాడ్యయేషన్ : –

కమలా హారిస్‌ హోవర్డ్‌ యూనివర్సిటి నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.. మొదటిసారిగా 2003లో శాన్‌ఫ్రాన్సిస్కోలో డిస్ర్టిక్‌ అటార్నిగా.. 2010లో అటార్ని జనరల్‌ ఆఫ్‌ కాలిఫోర్నియాగా ఎన్నికయ్యారు. 2014లో అదే పదవికి రీఎలక్ట్‌ అయ్యారు కమల. అదే సంవత్సరంలో డగ్‌ ఎమోఫ్ అనే న్యాయవాదిని పెళ్లి చేసుకున్నారామె. ఆమె భర్త యూదు మతానికి చెందినవాడు. 2016లో జరిగిన సెనేట్‌ ఎలక్షన్స్‌లో లోరెట్టా శాంచెజ్‌ను ఓడించి రెండో ఆఫ్రికన్‌ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు కమల. అంతేకాకుండా మొదటి సౌత్‌ ఏషియన్‌ అమెరికన్‌గా యూనైటెడ్‌ స్టేట్స్‌ సెనేటర్‌గా సేవలందించారు. ఇక 2017 నుంచి ఇప్పటివరకు కాలిఫోర్నియా నుంచి జూనియర్‌ యునైటెడ్‌ స్టేట్స్‌ సెనేటర్‌గా సేవలందించారామె.

ఎన్నో సంస్కరణలు : –

సెనేటర్‌గా కమల ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మారణాయుధాలపై నిషేధం, ప్రొగ్రెసివ్‌ ట్యాక్స్‌ రిఫామ్స్‌తో పాటు అనేక మార్పులు చేపట్టారు. డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తి.. ఒక్కసారిగా అమెరికా అటెన్షన్‌ని తన వైపు తిప్పుకుంది కమలా హారిస్. ఆ సమయంలో ట్రంప్‌ అనుచరుడు బ్రెట్ కవనాగ్‌ ఓ మహిళపై చేసిన లైంగిక దాడిని తీవ్రంగా ఖండించారామె. గతేడాది జనవరి 20న అమెరికా ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా 2020లో ఎలక్షన్స్‌లో పోటీ చేయబోతున్నట్లు కమల ప్రకటించారు.ఆమె అనౌన్స్‌మెంట్‌ తర్వాత రికార్డ్‌ స్థాయిలో డోనేషన్స్‌ వచ్చాయి. ఆక్లాండ్‌లో ఆమె క్యాంపెయిన్‌ ఈవెంట్‌ ప్రారంభానికి సుమారు 20 వేల మంది హాజరయ్యారు. ఫండ్స్‌ చాలినంత లేని కారణంగా డిసెంబర్‌ 3, 2019లో నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత 2020 మార్చ్‌లో అమెరికా ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా జో బైడెన్‌ను బలపరిచారు కమల.

జార్జ్ ప్లాయిడ్ హత్య : –

2019 మార్చ్‌లో అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా బ్లాక్‌ లీవ్స్ మ్యాటర్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. వేలాది మంది నల్లజాతీయులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. పోలీసుల దుశ్చర్యకు నిరసనగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో జో బైడెన్‌కు సహచరిగా నల్లజాతీయురాలిని ఎన్నుకోమని పలువురు సూచించారు. అదే సమయంలో పలు మీడియా చానెళ్లు కమలా హారిస్‌నే వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబోతున్నట్లు కథనాలు రాశారు. తనపై వస్తున్న వార్తలపై కమలా స్పందించారు. ఒకవేళ తనను వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా నిలబెడితే గౌరవంగా భావిస్తానని చెప్పింది. ఇక ఆగస్టు 11.. 2020లో కమలను తన రన్నింగ్ మేట్‌గా బైడెన్‌ అధికారికంగా ప్రకటించారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా నియమితులైన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, మొదటి ఇండియన్‌ అమెరికన్‌గా కమలా హారిస్‌ చరిత్ర సృష్టించారు.

ఎన్నికల్లో కీలక పాత్ర : –
ఇక 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలపై కమలా హారిస్‌ విరుచుకుపడ్డారు. ఆయన నిలకడలేని తీరును ఎండగడుతూ.. జో బైడెన్‌తో కలిసి కమలా ఎలక్షన్ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడంలో ట్రంప్‌ విఫలమయ్యారని పదేపదే ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఎలక్షన్స్‌లో జో బైడెన్‌కు 306 ఓట్లు రాగా, డొనాల్డ్‌ ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చాయి. అమెరికా ఫలితాలు వెలువడిన వెంటనే వీ డిడ్‌ ఇట్‌ జో.. వి డిడ్ ఇట్‌ అంటూ బైడెన్‌‌కు శుభాకాంక్షలు తెలిపారు కమల.

ట్రెండింగ్ వార్తలు