Sun Incorporate Earth : భూమిని సూర్యుడు కబళించనున్నాడా? తనలో కలుపుకుని భస్మీపటలం చేయనున్నాడా?

భూమిపై జీవం ఆవిర్భవించడానికి కారణమైన సూర్యుడు.. గ్రహాలు ఒకదానికొకటి ఢీకొనకుండా క్రమపద్ధతిలో పరిభ్రమణం చేయడానికి కూడా సాయపడుతున్నాడు. అయితే బుధుడు, శుక్రుడితో పాటు భూమిని కూడా తనలో కలుపుకుని భస్మీపటలం చేసే దిశగా సూర్యుడి ప్రయాణం కొనసాగుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు పేర్కొన్నారు.

Sun Incorporate Earth : భూమిపై జీవం ఆవిర్భవించడానికి కారణమైన సూర్యుడు.. గ్రహాలు ఒకదానికొకటి ఢీకొనకుండా క్రమపద్ధతిలో పరిభ్రమణం చేయడానికి కూడా సాయపడుతున్నాడు. అయితే బుధుడు, శుక్రుడితో పాటు భూమిని కూడా తనలో కలుపుకుని భస్మీపటలం చేసే దిశగా సూర్యుడి ప్రయాణం కొనసాగుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు పేర్కొన్నారు.

విశ్వాంతరాళంలోకి సూర్యుడు నిరంతరం శక్తిని విడుదల చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. కేంద్రకంలోని హైడ్రోజన్‌, హీలియం వంటి పరమాణువుల సంలీన చర్యల కారణంగా సూర్యుడు ఈ ఉష్ణాన్ని విడుదల చేస్తున్నాడు. అయితే, రానున్న కాలంలో హైడ్రోజన్‌ కొరత కారణంగా సూర్యుడు రెడ్‌ జెయింట్‌గా మారుతాడని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.  ఈ సమయంలో సూర్యుడి బయటి పొర వందల రెట్ల పరిధిలో విస్తరిస్తుందని చెబుతున్నారు.

ISRO : సూర్యుడు రహస్యాలను కనుగొనటానికి ఆదిత్య ఎల్1తో పాటు ఇస్రో లిస్టులో.. ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు

దీని వల్లే సూర్యుడికి దగ్గరగా ఉన్న బుధుడు, శుక్రుడు, భూమిపై ప్రభావం పడి ఆయా గ్రహాలు మండిపోవచ్చని అంటున్నారు. రాబోయే 500 కోట్ల ఏళ్లలో బుధుడు, శుక్రుడు, భూమిని.. సూర్యుడు తనలో కలుపుకోవచ్చని అంచనా. కాగా, సూర్యుడు తన జీవితకాలంలో మధ్య స్థితికి వచ్చాడని, ఇప్పుడు ఆ నక్షత్రం వయసు 457 కోట్ల ఏళ్లు ఉండవచ్చని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ఇటీవల వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు