ISRO : సూర్యుడు రహస్యాలను కనుగొనటానికి ఆదిత్య ఎల్1తో పాటు ఇస్రో లిస్టులో.. ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు

సూర్యుని రహస్యాలను కనుగొనేందుకు.. ఆదిత్య ఎల్1 ఒక్కటే కాదు. ఇస్రో లిస్టులో.. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు ఇంకా చాలా ఉన్నాయ్. అవన్నీ.. వచ్చే ఏడాది మొదట్లోనే చేయబోతున్నారు మన సైంటిస్టులు. వాటి కోసం.. అవన్నీ విజయవంతమైతే.. ఇస్రోతో పాటు ఇండియా ఖ్యాతి కూడా గ్లోబ్ మొత్తం డబుల్ అవుతుంది.చంద్రయాన్‌-3, గగన్‌యాన్‌ మిషన్‌,వీనస్‌ ఆర్బిటర్‌ మిషన్‌, నిసార్ మిషన్‌ ఇలా పలు కీలక శాటిలైట్ మిషన్లపై ఇస్రో పనిచేస్తోంది.

ISRO : సూర్యుడు రహస్యాలను కనుగొనటానికి ఆదిత్య ఎల్1తో పాటు ఇస్రో లిస్టులో.. ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు

List of ISRO's Upcoming Missions..

ISRO launch Aditya L1 : సూర్యుని రహస్యాలను కనుగొనేందుకు.. ఆదిత్య ఎల్1 ఒక్కటే కాదు. ఇస్రో లిస్టులో.. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు ఇంకా చాలా ఉన్నాయ్. అవన్నీ.. వచ్చే ఏడాది మొదట్లోనే చేయబోతున్నారు మన సైంటిస్టులు. వాటి కోసం.. చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే.. అవన్నీ అంతరిక్ష రంగంలో భారత్ ప్రతిష్టను పది మెట్లు ఎక్కించే రీసెర్చ్‌లు. అవన్నీ విజయవంతమైతే.. ఇస్రోతో పాటు ఇండియా ఖ్యాతి కూడా గ్లోబ్ మొత్తం డబుల్ అవుతుంది.చంద్రయాన్‌-3, గగన్‌యాన్‌ మిషన్‌,వీనస్‌ ఆర్బిటర్‌ మిషన్‌, నిసార్ మిషన్‌ ఇలా పలు కీలక శాటిలైట్ మిషన్లపై ఇస్రో పనిచేస్తోంది.

ఆదిత్య ఎల్1 తర్వాత.. ఇస్రో నుంచి రాబోయే వరుస మిషన్ల లిస్ట్ ఇది. ఇందులో.. గగన్ యాన్, చంద్రయాన్ -3 ఎంతో కీలకమైనవి. వీటి కోసం.. ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడుతున్నారు. ముఖ్యంగా.. ఆదిత్య ఎల్1 తర్వాత.. చంద్రయాన్-3 మిషన్‌ని లాంచ్ చేసేందుకు ఇస్రో ఉవ్విళ్లూరుతోంది. 2023 ప్రారంభంలోనే.. దీనికి కూడా ముహూర్తం పెట్టుకున్నారు. మూన్ మీద ల్యాండ్ అయ్యేందుకు.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేస్తున్న రెండో ప్రయత్నమే.. చంద్రయాన్-3 మిషన్. ఇది గనక సక్సెస్ అయితే.. ఇంటర్ ప్లానెటరీ మిషన్స్‌కి.. మార్గం సుగమమవుతుంది.

Also read : ISRO launch Aditya L1 : సూర్యుడిని టార్గెట్ చేసిన ఇస్రో..ఆదిత్యయాన్‌తో రహస్యం వీడుతుందా?

చంద్రయాన్-3 మిషన్ ప్రస్తుతం.. అభివృద్ధి దశలో ఉంది. శాటిలైట్ అన్ని రకాల వాతావరణాలను తట్టుకునేలా.. ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొంటోందని.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఇక.. ఈ మిషన్‌కి ప్రైవేట్ కంపెనీలతో పాటు ఇతర స్పేస్ ఏజెన్సీలేవి సహకరించడం లేదు. కానీ.. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ మిషన్ కోసం సబ్-సిస్టమ్స్‌ని తయారుచేసి అందించాయి. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్‌కి కొనసాగింపుగా వస్తున్నదే.. చంద్రయాన్-3. గత మిషన్‌లో.. భారత్‌కు చెందిన మోస్ట్ పవర్‌ఫుల్ రాకెట్ జీఎస్ఎల్వీ-ఎంకె3 ద్వారా.. చంద్రుని సౌత్ పోల్‌పై రోవర్‌ని ల్యాండ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ.. విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అయింది. ఈ మిషన్‌లో.. చంద్రయాన్-2లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటున్నారు. ప్రొపల్షన్ సిస్టమ్‌తో సహా హార్డ్‌వేర్‌కు సంబంధించి.. అనేక టెస్టులు చేస్తున్నారు. నిజానికి.. చంద్రయాన్-3 మిషన్‌ని.. ఈ ఆగస్టులోనే లాంచ్ చేయాల్సి ఉంది. కానీ.. కరోనా వల్ల ఆలస్యమైంది.

ఇక.. ఇస్రో చేపట్టిన మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్.. గగన్ యాన్. ఇది.. ఇస్రో చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన మిషన్. ఇది.. అంతరిక్షంలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు ఇండియా చేపట్టిన తొలి ప్రాజెక్ట్. స్పేస్‌లోకి మనుషులను పంపడానికంటే ముందు.. ఇస్రో.. రెండు మానవరహిత మిషన్లను చేపట్టనుంది. క్రూ ఎస్కేప్ సిస్టమ్ పనితీరు, పరిశీలనకు.. గగన్ యాన్ మానవ రహిత మిషన్లను నిర్వహిస్తారు. ఈ రెండు మిషన్లు విజయవంతంగా పూర్తయితే.. అప్పుడు నింగిలోకి ఆస్ట్రోనాట్స్‌ని పంపుతారు. ఇది.. వంద శాతం ఇండియన్ మిషన్. దీనికి సంబంధించిన సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఓవరాల్ కో-ఆర్డినేషన్, ఇంప్లిమెంటేషన్ అంతా ఇస్రోదే. గగన్ యాన్ మిషన్ మొత్తం బడ్జెట్ 9 వేల 23 కోట్లు. ఇది గనక విజయవంతమైతే.. అది భారతదేశానికి గర్వకారణమే కాదు.. సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు పరిశ్రమల్లోనూ.. విశేషమైన పురోగతికి దారితీస్తుంది. అన్నింటికన్నా ముందు.. సౌర వ్యవస్థను అన్వేషించడానికి.. స్థిరమైన ప్రోగ్రామ్‌ను డెవలప్ చేయడానికి.. ఇదొక పెద్ద అడుగు కానుంది.

గగన్ యాన్ కోసం.. నలుగురిని ఎంపిక చేసి.. వారికి రష్యాలో శిక్షణ ఇచ్చారు. వచ్చే ఏడాది.. మానవ సహిత గగన్‌యాన్‌ను ఎలాగైనా పూర్తి చేయాలని.. ఇస్రో శాస్త్రవేత్తలు చూస్తున్నారు. లో ఎర్త్ ఆర్బిట్‌లోకి.. దేశీయ లాంచ్ వెహికిల్ ద్వారా మనుషులను పంపి.. తిరిగి వారిని భూమికి తీసుకురావడమే.. ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ మిషన్‌లో.. ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్, ఐఎండీ, డీఆర్డీవో, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ, సీఎస్ఐఆర్ ల్యాబ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ లాంటి సంస్థలు కూడా.. భాగమవుతున్నాయి.

శుక్ర గ్రహంపై.. అన్వేషణ కోసం.. ఇస్రో చేపట్టేబోయే మిషన్ శుక్రయాన్ 1. ఇది.. శుక్ర గ్రహం ఉపరితలాలు, నిస్సార ఉపరితలాలతో పాటు వాతావరణ తీరు తెన్నులపై పరిశోధన చేస్తుంది. ఈ ప్రయోగానికి.. జీఎస్ఎల్వీ ఎంకే2 రాకెట్‌ను ఉపయోగించనుంది ఇస్రో. 2024 డిసెంబర్‌లో.. శుక్రయాన్-1 లాంచ్ చేయాలని చూస్తున్నారు. దీని తర్వాత.. మంగళ్‌యాన్-2ని లాంచ్ చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. రోవర్.. అంగారకుడిపై దిగి అక్కడి నమూనాలను భూమిపైకి పంపిస్తుంది.