Cat
Woman Breastfeeds Cat: పిల్లికి తన పాలు ఇస్తూ తోటి ప్రయాణికులకు అసౌర్యం కలిగించింది ఓ మహిళ. ఈ ఘటనకు సంబంధించిన మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూఎస్ డెల్టా ఎయిర్ ఫ్లైట్ DL1360లో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని సిరక్యూస్ నుండి జార్జియాలోని అట్లాంటాకు వెళ్తున్న ఓ మహిళ పిల్లికి బ్రెస్ట్ ఫీడ్(తల్లిపాలు ఇవ్వడం) చేయడం ఇతర ప్రయాణికులకు ఆందోళన కలిగించింది.
దీంతో ఆ క్యాట్‌ను క్యారియర్‌లో పెట్టాలని, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించరాదని విమాన సిబ్బంది ఆమెను రిక్వెస్ట్ చేశారు. కానీ సదరు మహిళ ససేమిరా అనడంతో పైలట్.. రెడ్‌కోట్ గ్రౌండ్ టీమ్‌కు షార్ట్ మెసేజ్ పంపించారు. ‘సీటు నంబరు 13Aలోని ప్రయాణికురాలు పిల్లికి పాలిస్తోంది. క్యాట్‌ను కారియర్‌లో పెట్టాలని ఫ్లైట్ అటెండెంట్ రిక్వెస్ట్ చేసినా పట్టించుకోవడం లేదు. మీరు మందలించండి’ అని కాక్‌పిట్ నుంచి గ్రౌండ్‌కు మెసేజ్ పంపారు.
Vikky – Katrina : నన్ను పెళ్ళికి పిలవలేదు.. విక్కీ-కత్రీనా మ్యారేజ్ పై కియారా
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోటో.. ఎయిర్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్స్ అడ్రస్సింగ్ మరియు రిపోర్టింగ్ సిస్టమ్‌ని ఉపయోగించి విమాన సిబ్బంది భూమికి పంపిన సందేశం. ల్యాండింగ్ తర్వాత ఎయిర్‌లైన్ “రెడ్ కోట్” బృందం పరిస్థితిని పరిష్కరించాలని మెసేజ్‌లో ఉంది.
I saw this on Reddit today. It’s an a ACARS in-flight message from the cockpit to the ground.
Also, civilization had a good run. pic.twitter.com/AjQhIaE80H
— Rick Wilson (@TheRickWilson) November 24, 2021