cockroach Fry : బొద్దింకల ఫ్రై .. ఎర్రమిర్చితో నంచుకుని లాగించేస్తున్న యువతి

ఏదో చికెనో మటనో తిన్నట్లుగా బొద్దింకల్ని ఫ్రై చేసుకుని లాగించేస్తోంది. చక్కగా బొద్దింకల్ని ప్రై చేసి వాటిని ఎర్రటి మిర్చిలో నంజుకుని లొట్టలేస్తోంది లాగించేస్తోంది.

cockroach Fry : బొద్దింకల ఫ్రై .. ఎర్రమిర్చితో నంచుకుని లాగించేస్తున్న యువతి

Woman eating cockroach fry

Updated On : August 15, 2023 / 4:13 PM IST

Woman eating cockroach Fry : బుర్రకో బుద్ధి, జిహ్వకో రుచి అని ఊరికే అనలేదు.ఈ అమ్మాయిని చూస్తే అదే అనిపిస్తుంది. చాలామంది చక్కగా చికెనో,మటనో లేదా ఫిష్ లాంటివి వేపుకుని తిన్నట్లుగా ఓ అమ్మాయి ఏకంగా బొద్దింకల్ని వేపుకుని చక్కగా ఎర్రమిర్చి చట్నీతో నంజుకుని లొట్టలేసుకుంటు తినేస్తోంది.

చైనాలో పాములు, తేళ్లు, చెదపురుగులు వంటి కీటకాలను వండుకుని తింటారు. కానీ అమ్మాయి ఏ దేశానికి చెందిన అమ్మాయో గానీ చక్కగా బొద్దింకల్ని ఫ్రై చేసుకుని వాటిని టమోటా,ఎర్రటి మిర్చి లిక్విడ్ లో ముంచుకుని లొట్టలేసుకుంటు లాగించేస్తోంది. చూస్తుంటేనే వాంతి వచ్చేలా ఉండే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా టొమాటో-మిరపకాయ చట్నీతో మోమోస్ తింటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం బొద్దింకల్ని తినేస్తోంది. బొద్దింకల్ని నూనెలో వేయించి, ప్లేట్‌లో వడ్డించినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ప్లేటులో టమాటా-మిరపకాయ చట్నీ పెట్టుకుని వేయించిన బొద్దింకలను ఎర్ర చట్నీలో బాగా ముంచి లొట్టలేస్తు లాగించేస్తోంది.