Kebab కొని తినేందుకు 75కి.మీ నడిచి వెళ్లిన మహిళ.. లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేసిందని రూ.88వేలు జరిమానా వేశారు!

  • Publish Date - September 8, 2020 / 10:24 PM IST

తనకెంతో ఇష్టమైన కెబాబ్ కొనేందుకు 75 కిలోమీటర్ల దూరం నడుస్తూ వెళ్లిన మహిళకు రూ.88వేల జరిమానా పడింది.. అదేంటీ కెబాబ్ కొనేందుకు వెళ్తే ఫైన్ వేయడమేంటి? అనుకుంటున్నారా? అవును మరి.. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో బయటకు వెళ్తే రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ విధిస్తారు.. అదే జరిగింది.. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. రెస్టారెంట్లలకు వెళ్లి తినే పరిస్థితి లేదు.. ఇంట్లో ఫుడ్ తిని బోర్ కొట్టేసింది..



అందుకే కాబోలు ఆమెకు.. బయటకు వెళ్లి ఇష్టమైన కెబాబ్ తినాలపించింది.. అంతే లాక్ డౌన్ ఉన్న పట్టించుకోలేదు.. తన ఇంటి నుంచి ఒకటి కాదు.. పది కాదు.. ఏకంగా 75 కిలోమీటర్ల వరకు నడుస్తూ వెళ్లింది.. భారీ మూల్యం చెల్లించుకుంది ఆస్ట్రేలియాకు చెందిన మహిళ..

ఆస్ట్రేలియాలో కరోనావైరస్ ఆంక్షలలో భాగంగా నాలుగో దశ కొనసాగుతోంది. అదే సమయంలో కబాబ్ కొనడానికి తన ఇంటి నుండి 75 కిలోమీటర్ల దూరం నడిచింది. మెల్బోర్న్‌కు నైరుతి దిశలో ఉన్న వెర్రిబీలో ఆమెను పోలీసులు ఆపి ప్రశ్నించారు.. తాను జిలాంగ్‌ నుంచి వచ్చానని కబాబ్ తినడానికి మెల్‌బోర్న్‌కు వచ్చిందని చెప్పింది. అలాగే వెర్రిబీలోని తన ప్రియుడిని కలవాల్సి ఉందని చెప్పింది.



నగరానికి రాత్రి 8:00 నుంచి ఉదయం 5:00 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.. ఆ సమయంలో ఆమె లాక్ డౌన్ పరిమితులను ఉల్లంఘించిందని పోలీసులు చెప్పారు. అత్యవసర విషయాలకు మాత్రమే ఇళ్లలో నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంది. లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి కబాబ్స్ కొనడం కోసం వచ్చిందని ఆ మహిళకు భారీ ఫైన్ వేశారు పోలీసులు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెకు AU $ 1652 (రూ. 88,466) జరిమానా విధించారు. గత 24 గంటల్లో విక్టోరియాలో లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు జరిమానా విధించిన 171 మందిలో ఆమె ఒకరు.



ఆహారం కోసం లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించడం ఇదే మొదటిసారి కాదు. జూలైలో, ఒక మెల్బోర్న్ వ్యక్తి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడు.. బటర్ చికెన్ కోసం తన ఇంటి నుండి 32 కిలోమీటర్ల దూరం నగర కేంద్రానికి నడిచి వెళ్లాడు. అతను రెస్టారెంట్‌కు వెళ్లడానికి ముందే పోలీసులు అతన్ని అడ్డుకుని 1652 డాలర్ల జరిమానా విధించారు.

ట్రెండింగ్ వార్తలు