Florida : విమానంలో సిగరేట్ తాగిన యువతి..తర్వాత ఏమైందో తెలుసా ?
విమానంలో ఉన్న తోటి ప్రయాణీకుడు దీనిని వీడియో తీసి టిక్ టాక్ లో పోస్టు చేయగా..ఇది వైరల్ గా మారింది.

Woman Lights Cigarette
Woman Lights Cigarette : సిగరేట్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ వైద్యులు హెచ్చరిస్తూనే ఉంటారు. అంతేగాకుండా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రకటనలు సైతం గుప్పిస్తుంటారు. బహిరంగ ప్రదేశాల్లో సిగరేట్ వెలిగిస్తే..జరిమానాలు విధిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేస్తారు కూడా. కానీ కొంతమంది మాత్రం డోంట్ కేర్ అంటారు.
అయితే..కొన్ని దేశాల్లో మాత్రం బహిరంగప్రదేశాల్లో సిగరేట్ తాగితే..కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమాన కూడా విధిస్తారు. సిగరేట్ తాగడం వల్ల అక్కడున్న తోటి వారికి కూడా ఇబ్బందులు కలిగిస్తుంటారు. తాజగా..ఓ యువతి ఏకంగా విమానంలోనే సిగరేట్ తాగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన ఫ్లోరిడాలోని స్పిరిట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో గత మంగళవారం చోటు చేసుకుంది.
విమానంలో ఉన్న తోటి ప్రయాణీకుడు దీనిని వీడియో తీసి టిక్ టాక్ లో పోస్టు చేయగా..ఇది వైరల్ గా మారింది. ఫోర్ట్ లాడర్ వేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పిరిట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ అయ్యింది. రన్ వే మీదనే ఉంది. అంతలో విమానంలో ఉన్న ఓ యువతి సిగరేట్ తాగడం ప్రారంభించింది. దీంతో తోటి ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే ఓ వ్యక్తి రికార్డు చేశాడు. విమాన సెక్యూర్టీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ యువతిని కిందకు దిగిపోవాల్సిందిగా హెచ్చరించారు. యూఎస్ లో 1988లో బహరింగ ప్రదేశాల్లో సిగరేట్ తాగడం నిషేధమనే సంగతి తెలిసిందే.