AUS vs ENG 3rd Test : శతకంతో చెలరేగిన అలెక్స్ క్యారీ.. తొలి రోజు ఆసీస్‌దే..
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య అడిలైడ్ ఓవల్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ (AUS vs ENG 3rd Test ) ప్రారంభమైంది.
AUS vs ENG 3rd Test Alex Carey century Stumps Day 1 Australia 326 runs loss of 8 wickets
AUS vs ENG 3rd Test : యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య అడిలైడ్ ఓవల్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీ శతక్కొట్టడంతో (106; 143 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. మిచెల్ స్టార్క్ (33), నాథన్ లియాన్ (0)లు క్రీజులో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఇంగ్లాండ్ బౌలర్లకు షాకిచ్చారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (10), జేక్ వెదరాల్డ్ (18)లతో పాటు మార్నస్ లబుషేన్ (19), కామెరూన్ గ్రీన్ (0) లు విఫలం కావడంతో 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను సీనియర్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా (82; 126 బంతుల్లో 10 ఫోర్లు), వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీలు భుజాన వేసుకున్నారు.
Mangesh Yadav : ఆర్‌సీబీ కోట్లు కుమ్మరించిన మంగేష్ యాదవ్ ఎవరు? అతడి ట్రాక్ రికార్డు ఏంటి?
“That one is for you dad!”
A wonderful moment as the hometown hero Alex Carey brings up 100.#Ashes | #PlayoftheDay | @nrmainsurance pic.twitter.com/aEdfwRedz5
— cricket.com.au (@cricketcomau) December 17, 2025
వీరిద్దరు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఐదో వికెట్ కు 91 పరుగులు జోడించిన అనంతరం శతకం దిశగా సాగుతున్న ఖవాజాను విల్ జాక్స్ ఔట్ చేశాడు. ఆ తరువాత జోష్ ఇంగ్లిష్ (32) పర్వాలేదనిపించగా పాట్ కమిన్స్ (13) విఫలం అయ్యాడు. మిచెల్ స్టార్క్ అండతో అలెక్స్ క్యారీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేసిన కాసేపటికే ఎనిమిదో వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. నాథన్ లియాన్ సాయంతో మరో వికెట్ పడకుండా మిచెల్ స్టార్క్ తొలి రోజును ముగించాడు.
IND vs SA : గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌కు భారీ షాక్.. పండగ చేసుకుంటున్న సౌతాఫ్రికా!
యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
