IND vs SA : గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌కు భారీ షాక్.. పండగ చేసుకుంటున్న సౌతాఫ్రికా!
ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో (IND vs SA) విజయం సాధించి జోష్‌లో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది.
Big shock to Team India Axar Patel ruled out of last two T20Is against South Africa
IND vs SA : ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించి జోష్‌లో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దక్షిణాఫ్రికాతో జరగనున్న చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది.
అతడు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే అతడు మూడో టీ20 మ్యాచ్‌కు (IND vs SA ) సైతం దూరం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్షర్ పటేల్ జట్టుతోనే లక్నోలో ఉన్నాడు, అక్కడ అతనికి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఇక అతడి స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ ను ఎంపిక చేసింది.
బెంగాల్‌కు చెందిన 31 ఏళ్ల షాబాజ్ అహ్మద్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 3 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. మొత్తం 5 వికెట్లు పడగొట్టాడు.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. బుధవారం (డిసెంబర్ 17న) లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే గెలుచుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది.
చివరి రెండు టీ20ల కోసం నవీకరించిన భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్.
🚨 NEWS 🚨#TeamIndia allrounder, Axar Patel has been ruled out of the remaining two @IDFCFIRSTBank T20Is against South Africa due to illness.
🔽 Details | #INDvSA | @akshar2026 https://t.co/CZja7iaLNm
— BCCI (@BCCI) December 15, 2025
