Ghost in Bar: బార్‌లో దెయ్యం.. బీర్ గ్లాస్ పడేసిందంటూ గగ్గోలు

మీకు దెయ్యాలపైన నమ్మకముందా.. పారానార్మల్ యాక్టివిటీస్ గురించి ఎప్పుడైనా భయపడ్డారా.. అయితే యూకేలోని సండర్లాండ్ బార్ లో జరిగిన ఘటన వీడియో చూసి ఒక్కసారి నిర్ణయం తీసుకోండి. గతంలో అక్కడ

Ghost in Bar: బార్‌లో దెయ్యం.. బీర్ గ్లాస్ పడేసిందంటూ గగ్గోలు

Ghost In Bar

Updated On : November 24, 2021 / 7:42 AM IST

Ghost in Bar: మీకు దెయ్యాలపైన నమ్మకముందా.. పారానార్మల్ యాక్టివిటీస్ గురించి ఎప్పుడైనా భయపడ్డారా.. అయితే యూకేలోని సండర్లాండ్ బార్ లో జరిగిన ఘటన వీడియో చూసి ఒక్కసారి నిర్ణయం తీసుకోండి. గతంలో అక్కడ చాలా జరిగాయి వాటికి సాక్ష్యమే ఈ వీడియో. ఇందులో నిలబెట్టి ఉన్న బీర్ గ్లాస్ ను కిందపడేలా చేస్తుంది చూడమని దాని ఓనరే పోస్టు చేశారు.

బ్లూ హౌజ్ పబ్ లో నలుగురు వ్యక్తులు బార్ లోపల ఉండగా.. కస్టమర్ ఒక్కడే వాళ్ల ముందు కూర్చొని ఉన్నాడు. గ్లాస్ నిండాబీర్ పోసి అతని ముందుంచారు. కొద్దిక్షణాల తర్వాత గ్లాసు కొంచెం ముందుకుజరిగి సడెన్ గా పడిపోయింది. ఎవరూ తాకకుండానే ఉన్నట్టుండి పడిపోయిన గ్లాస్ చూసి అంతా షాక్ అయ్యారు.

దెయ్యముందనే రూమర్లకే.. ఇళ్లు, ఊర్లు వదిలివెళ్లిపోయే వాళ్ల గురించి చాలాసార్లు విన్నాం. కానీ, 167ఏళ్ల ఈ పాత బార్ లో దెయ్యాలుంటాయని తెలిసి తరచూ వెళ్తుంటారట కస్టమర్లు. ఇతనికి ఒక్కడే కాదట గతంలోనూ ఈ పారానార్మల్ యాక్టివిటీలు చాలా చూశారట కస్టమర్లు.

………………………………………. : ‘భీమ్లానాయక్‌’లో పవన్ కళ్యాణ్‌తో పాట పాడిస్తా