Dog Birthday: కుక్క బర్త్ డే కోసం రూ.11 లక్షలు వెచ్చించి 520 డ్రోన్లతో సెలబ్రేషన్

పెంపుడు కుక్క పదో బర్త్ డే కోసం రూ.11లక్షలు ఖర్చు పెట్టింది ఆ మహిళ. చైనాలోని ఆ యువతి పెంపుడు కుక్కపై తనకున్న ప్రేమను ఎవరికి చూపించాలనుకుందో.. గానీ 520డ్రోన్లు అద్దెకు తెచ్చుకుని...

Dog Birthday: కుక్క బర్త్ డే కోసం రూ.11 లక్షలు వెచ్చించి 520 డ్రోన్లతో సెలబ్రేషన్

Dog Birth Day

Updated On : January 6, 2022 / 4:29 PM IST

Dog Birthday: పెంపుడు కుక్క పదో బర్త్ డే కోసం రూ.11లక్షలు ఖర్చు పెట్టింది ఆ మహిళ. చైనాలోని ఆ యువతి పెంపుడు కుక్కపై తనకున్న ప్రేమను ఎవరికి చూపించాలనుకుందో.. గానీ 520డ్రోన్లు అద్దెకు తెచ్చుకుని ఆకాశమంతా కనిపించేలా దీపాలతో సెలబ్రేట్ చేసింది. సెంట్రల్ చైనా హూనన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన గురించి సౌత్ చైనా మార్నింగ్స్ పోస్టు అనే ఇంగ్లీష్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది.

డ్రోన్లు వాడి Happy 10th birthday to Doudou అని ఆకాశంలో కనిపించే ఏర్పాట్లు చేసింది. అంతేకాదు డ్రోన్లు చక్కర్లు కొడుతూ కేక్ ఆకారంలోనూ మెరిసిపోయాయి. మాండరిన్ భాషలో 520 అనే నెంబర్ కు అర్థం ఐ లవ్ యూ. అదే ప్రతిబింబించాలని ఆమె 520డ్రోన్లను అద్దెకు తీసుకుని ఈ ఫీట్ చేసిందని స్థానికులు చెబుతున్నారు.

అంత ఖర్చుపెట్టి సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినా సక్సెస్ కాలేదు. కారణం.. అది నో ఫ్లైయింగ్ జోన్ కావడమే. రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఎత్తైన అపార్ట్‌మెంట్ల మధ్య డ్రోన్లు ఎగరడానికి ముందు పోలీసుల అనుమతి తీసుకోవాలి. దీనికి గానూ ఆమెపై లోకల్ పోలీస్ సీరియస్ అయ్యారు.

ఇది కూడా చదవండి: వనమా రాఘవేంద్ర రావు అరెస్ట్!