Guinness World Record
90 hours of non-stop cooking : సాధారణ రోజుల్లో ఓ గంట.. పండుగరోజుల్లో ఏవైనా స్పెషల్స్ చేస్తే రెండు, మూడు గంటలు కిచెన్‌లో వంట పని ఉంటేనే బాబోయ్……. పని అనుకుంటాం.. కానీ ఓ చెఫ్ దాదాపుగా 90 గంటలు ఆపకుండా వంటలు చేస్తూనే ఉంది. 110 రకాల వంటలు తయారు చేసి ప్రపంచ రికార్డు (World Record) ఫలితం కోసం ఎదురుచూస్తోంది.
1.6 lakh pizza for a client : ఓ చెఫ్ తన క్లయింట్ కోసం తయారు చేసిన పిజ్జా ఖరీదు అక్షరాల 1.63 లక్షలు..
ఏదైనా రికార్డ్ సాధించాలంటే ఏదో ఒక కళలో ప్రావీణ్యులై ఉండాలి. 27 ఏళ్ల నైజీరియన్ చెఫ్ (nigerian chef) హిల్డా బాసీ (hilda baci)అద్భుతంగా వంటలు చేస్తుంది. తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో ప్రపంచ రికార్డు క్రియేట్ చేయాలని అనుకుంది. అంతే 87 గంటల 46 నిముషాల పాటు నాన్ స్టాప్ వంటలు చేసింది. 110 రకాల ఆహార పదార్ధాలను సిద్ధం చేసింది. అయితే ఇంకా రికార్డ్ టైటిల్ నిర్ధారణ కావాల్సి ఉంది.
కరోనా వల్ల ఉపాధి కోల్పోయి…రోడ్డు పక్కన బిర్యానీ అమ్ముకుంటున్న ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్
వంట చేయాలంటే అందులో ప్రావీణ్యం.. కొత్త రకాలు వండగలగడం.. అందులో శిక్షణ పొంది ఉండటం అవసరం. ఇన్ని అంశాలలో నిష్ణాతురాలైన బాసీ సక్సెస్ ఫుల్‌గా అన్ని గంటల పాటు వంటలు చేసి రికార్డు కోసం తన ప్రయత్నం పూర్తి చేసింది. బాసీ 2019లో రికార్డు నెలకొల్పిన భారతీయ చెఫ్ లతా టోండో రికార్డును చెరిపేసింది. ఇక బాంసి వంట చేయడం మొదలు పెట్టగానే ఆమెలో ఉత్సాహం నింపేందుకు పొలిటీషియన్స్, సెలబ్రిటీలు, గెస్ట్స్ ఆన్ లైన్‌లో ఫుల్ సపోర్ట్ చేశారు. ఇక రికార్డు రిజల్ట్ రావడమే ఆలస్యం.