1.6 lakh pizza for a client : ఓ చెఫ్ తన క్లయింట్ కోసం తయారు చేసిన పిజ్జా ఖరీదు అక్షరాల 1.63 లక్షలు..
ఏదైనా స్పెషల్ ఉంటేనే కదా.. ఖరీదు ఎక్కువైనా డబ్బులు ఖర్చుపెడతాం. అయితే ఓ పిజ్జా కోసం లక్షలు ఖర్చుపెట్టాలంటే వెనకడుగు వేస్తాం. ఓ క్లయింట్ మాత్రం అక్షరాల 1.63 లక్షల ఖరీదైన పిజ్జా తయారు చేయమని చెఫ్‌కి ఆర్డర్ ఇచ్చాడు.

1.6 lakh pizza for a client
1.6 lakh pizza for a client : తినడానికి ఎంత డబ్బైనా ఖర్చుపెట్టే వారు ఉంటారు. కేవలం పిజ్జా కోసం 1.6 లక్షలు ఖర్చుపెట్టేవారు ఉన్నారా? అంటే ఉంటారు. ఓ చెఫ్‌కు క్లయింట్ నుంచి అక్షరాల అంతే ఖరీదైన పిజ్జా ప్రిపేర్ చేయమని ఆర్డర్ వచ్చింది. ఇక ఆ చెఫ్ ఆ పిజ్జా కోసం చేసిన షాపింగ్, తయారు చేస్తున్నప్పుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Flying Pizza : ఫ్లయింగ్ పిజ్జా చూసారా? ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చూసేయండి..
బ్రూక్ అనే చెఫ్‌కి ఓ క్లయింట్ నుంచి 1.63 లక్షల రూపాయల ఖర్చుతో కూడిన పిజ్జా తయారీ ఆర్డర్ వచ్చింది. ఇక బ్రూక్ ఈ పిజ్జా తయారీ కోసం తాను కొన్ని వస్తువుల వివరాలు చెబుతూ ముందుగా ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొన్ని ఆర్గానిక్ ఐటమ్స్‌తో పాటు బాదం, తేనె వంటి వాటిని కొనుగోలు చేసింది. ఇక తను పిజ్జా తయారు చేస్తుండగా మొత్తం వీడియో తీసింది. ‘ ఓ ప్రముఖ క్లయింట్ కోసం 2వేల డాలర్ల పిజ్జా తయారు చేద్దాం’ అనే క్యాప్షన్‌తో తాను తయారు చేసిన పిజ్జా వీడియో పోస్ట్ చేసింది. మరో వీడియోలో తన క్లయింట్‌కి పిజ్జాను సెర్వ్ చేస్తున్నట్లు పోస్ట్ చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
pizza delivery boy : హీరో అయిపోయిన పిజ్జా డెలివరీ బాయ్.. అతను చేసిన సాహసానికి పోలీసులు ఫిదా..
‘పిజ్జా నా అద్దె కంటే ఎక్కువ’ అని కొందరు.. ‘ధనవంతులకు తమ దగ్గర ఉన్న డబ్బు ఎలా ఖర్చుపెట్టాలో అర్ధం కాదని’.. మరికొందరు అభిప్రాయపడ్డారు. జిహ్వకో రుచి అన్నట్లు డబ్బుంటే ఇలాంటి అభిరుచులు కూడా ఉంటాయేమో మరి.
View this post on Instagram
View this post on Instagram