pizza delivery boy : హీరో అయిపోయిన పిజ్జా డెలివరీ బాయ్.. అతను చేసిన సాహసానికి పోలీసులు ఫిదా..

ఒక్కోసారి కళ్లముందు భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో నిస్సహాయంగా నిలబడిపోతాం లేదా పరుగులు తీస్తాం. ఓ పిజ్జా డెలివరీ బాయ్ ప్రాణాలకు తెగించి సాహసం చేసాడు. హీరో అయిపోయాడు.

pizza delivery boy : హీరో అయిపోయిన పిజ్జా డెలివరీ బాయ్.. అతను చేసిన సాహసానికి పోలీసులు ఫిదా..

pizza delivery boy

pizza delivery boy :  ఓ పిజ్జా డెలివరీ బోయ్ హీరో అయిపోయాడు. దొంగని పట్టుకోవడంలో పోలీసులకు సాయం చేయడంలో అతని ధైర్య, సాహసాలు చూస్తే మెచ్చుకుని తీరాల్సిందే.

Odisha : ఒడిశాలో గిరిజన తెగ వింత ఆచారం.. దుష్టశక్తులు దరిచేరకుండా చిన్నారులకు వీధి కుక్కలతో వివాహం

USలోని పెన్సిల్వేనియాలో ( Pennsylvania, US) టైలర్ మోరెల్ (Tyler Morrell) అనే 29 ఏళ్ల పిజ్జా (pizza) డెలీవరీ బాయ్‌ని జనం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే? మిడిల్ టౌన్ టౌన్‌షిప్‌లోని ఒక కస్టమర్ ఇంటికి మోరెల్ పిజ్జా డెలీవరీ చేయడానికి వెళ్లాడు. అనూహ్యంగా వీధిలో పోలీసు వ్యాన్ సైరన్ వినిపించింది. ఓ కారుని ఛేజ్ చేస్తూ పోలీస్ వ్యాన్ కనిపించింది. కారుని దొంగిలించి వెళ్తున్న ఓ దొంగను ఆ వ్యాన్ వెంబడిస్తోంది. కారుని ఆపి అందులోంచి దూకిన దొంగ మోరెల్ ఉన్న వైపు పరుగులు తీస్తూ వచ్చాడు. మోరెల్ ఒక్క క్షణం ఆగకుండా తన కాలితో అతడిని తన్ని కింద పడేశాడు. వెంటనే పోలీసులు దొంగను చుట్టుముట్టారు. అలా దొంగను పట్టుకోవడంతో మోరెల్ హీరో అయిపోయాడు. ఈ సీన్ అంతా అతను పిజ్జా డెలివరీ చేయడానికి వచ్చిన డోర్ బెల్ కెమెరాలో క్యాప్చర్ అయ్యింది. సోషల్ మీడియాలో షేరైన ఈ వీడియో చూసి అనేకమంది స్పందించారు.

Gujarat: వింత ఆచారం.. శివుడికి పీతలు సమర్పిస్తున్న భక్తులు.. ఎక్కడంటే

ఇక మోరెల్ సాహసాన్ని పోలీసులు సైతం మెచ్చుకున్నారు. అతను చేసిన సాయానికి ధన్యవాదాలు చెబుతూనే నీలాంటి మంచి వ్యక్తులకు ఉద్యోగం ఇవ్వడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇలాంటి ఉద్యోగిని పెట్టుకున్న కోకోస్ పిజ్జా ఆస్టన్ ( Coccos Pizza Aston) కంపెనీని అభినందించారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది.