World Diabetes Day 2023
World Diabetes Day 2023 : ఏటా నవంబర్ 14 న ‘ప్రపంచ మధుమేహ దినోత్సవం’ నిర్వహిస్తారు. షుగర్ వ్యాధి నియంత్రణ కోసం కృత్రిమ ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఫ్రెడరిక్ బాంటింగ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్ల జనాభాకు డయాబెటీస్ ఉన్నట్లు వరల్డ్ డయాబెటీస్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. ప్రతి పదిమందిలో ఒకరికి డయాబెటీస్ ఉంది. అయితే తమకు డయాబెటీస్ ఉందని చాలామందికి అవగాహన లేకపోవడమే ఈ వ్యాధి తీవ్రతకు కారణం. ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు తీస్తున్న అనేక ప్రమాదకర వ్యాధుల జాబితాలో డయాబెటీస్ తొమ్మిదవ స్ధానంలో ఉంది. మానవ రక్తంలో అధిక మోతాదులో చక్కెర నేరుగా కలవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది. ఈ వ్యాధి కారణంగా అరికాళ్లు, కంటి నరాలు, గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
షుగర్ వ్యాధి నియంత్రణకు కావాల్సిన కృత్రిమ ఇన్సులిన్‌ను 1922 లో కెనడాకు చెందిన ఫ్రెడరిక్ బాంటింగ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. 1991 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫెడరిక్ పుట్టినరోజును ‘ప్రపంచ మధుమేహ దినోత్సవం’గా ప్రకటించింది. ప్రపంచ దేశాలకు భారతదేశం డయాబెటీస్‌కు క్యాపిటల్‌గా మారిపోయింది. చైనా తర్వాత భారత్ తరువాత స్ధానంలో ఉంది. అనేక నివేదికలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. ఇండియాలో టైప్ 2 డయాబెటీస్ రోగులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్‌హెల్తీ లైఫ్‌స్టైల్, ఫ్యాటీ, షుగర్ రిచ్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అన్ని మధుమేహానికి కారణాలు.
డయాబెటీస్ మూడు రకాలుగా చెప్పవచ్చు. టైప్ 1, టైప్ 2 తో పాటు గర్భధారణ సమయంలో మధుమేహం. డయాబెటీస్ బారిన పడకుండా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. చిన్నారులు సైతం ఈ వ్యాధి బారిన పడుతుండటంతో వారికి హెల్తీ, సమతుల్య, పోషకాహారాన్ని ఇవ్వాలి. మల్టీగ్రెయిన్ బ్రెడ్, మల్టీ గ్రెయిన్ ఆటాను ఎంపిక చేసుకోవాలి. రైస్ తక్కువగా తీసుకోవాలి. సీడ్స్, యాపిల్, పపాయా, పీయర్ వంటివి తినవచ్చు. చీయా సీడ్స్, సన్ ఫ్లవర్ సీడ్స్, మామిడి, సపోటా, లిచీ వంటికి ఎంత తక్కువగా తింటే అంత మంచిది. క్యాండీస్, చాక్లైట్స్, చక్కెర పదార్ధాలకు దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకపోవడం బెటర్. ఆరోగ్యకరమైన లోఫ్యాట్, పోషకాహార స్నాక్స్ ముర్ముర, శెనగలు, సలాడ్స్, సూప్స్ వంటివి పిల్లలకు పెట్టాలి.
Diabetes : డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో సహాయపడే దొండకాయ!
ప్రతిరోజు కనీసం గంట వాకింగ్, సైక్లింగ్, జాగింగ్, స్కిప్పింగ్ లేదా శారీరక వ్యాయామంతో గూడిన ఆటలు మంచివి. కాస్త దూరమైనా నడక చాలా మంచిది. లిఫ్ట్‌లు (ఇతర ఆరోగ్య సమస్యలు లేకపోతే) ఉపయోగించకుండా మెట్లను ఎక్కాలి. స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. కనీసం రోజులో 15 నుంచి 20 నిముషాల పాటు ధ్యానం, యోగా, డీప్ బ్రీథింగ్ వ్యాయామాల ద్వారా స్ట్రెస్‌ను తగ్గించుకోవచ్చును. పెయింటింగ్, మ్యూజిక్, డ్యాన్స్ వంటి అలవాట్లు స్ట్రెస్ తగ్గిస్తాయి. ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే ఖచ్చితంగా ఏడాదికి ఒక్కసారైనా హెల్త్ స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది.