Almonds: బాదములు తినడం వల్ల ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్న రోగుల్లో బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు మెరుగుపడతాయా?

మా అధ్యయన ఫలితాలు సూచించే దాని ప్రకారం, డైటరీ వ్యూహాలలో భాగంగా బ్లడ్‌ గ్లూకోజ్‌ స్ధాయిలను తగ్గించడంలో అత్యంత కీలక తోడ్పాటుదారునిగా బాదములు ఉపయోగపడుతున్నాయి. ఈ ఫలితాలు చూపే దాని ప్రకారం, కొద్ది మొత్తంలో బాదములను ప్రతి భోజనానికీ ముందు తీసుకోవడం వల్ల వేగంగా, అద్భుతంగా గ్లైసెమిక్‌ నియంత్రణ అనేది భారతదేశంలోని ఆసియన్‌ ఇండియన్స్‌లో సాధ్యమవుతుంది

Almonds: బాదములు తినడం వల్ల ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్న రోగుల్లో బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు మెరుగుపడతాయా?

Does eating almonds improve blood sugar levels in patients with prediabetes?

Updated On : March 21, 2023 / 9:32 PM IST

Almonds: ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్న ఆసియాలోని భారతీయులు అధిక బరువు/ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులపై చేసిన నూతన అధ్యయనం చూపుతున్న దాని ప్రకారం భోజనాలకు ముందు బాదములు(Almonds) తినడం వల్ల బ్లడ్‌ షుగర్‌ నియంత్రణ స్ధాయికి మెరుగుపడింది; దాదాపు ఒక వంతు మంది 12 వారాలలో ప్రీ డయాబెటీస్‌ను రివర్శ్‌ చేసుకోగలిగారు.

MLC Kavitha : మూడోసారి ముగిసిన కవిత ఈడీ విచారణ.. 8గంటలకు పైగా ఎంక్వైరీ
బాదములపై చేసిన రెండు నూతన అధ్యయనాలు , ఒక అధ్యయనాన్ని మూడు రోజుల పాటు చేయగా, మరో అధ్యయనాన్ని మూడు నెలల పాటు నిర్వహించగా, అవి బాదముల వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడించాయి. ఈ అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, ప్రీ డయాబెటీస్‌, అధిక బరువు/ఊబకాయంతో బాధపడుతున్న ఆసియన్‌ భారతీయులలో మూడు నెలల పాటు నిత్యం బాదములు తీసుకోవడం వల్ల వారిలో ప్రీ డయాబెటీస్‌ పూర్తిగా తగ్గడం లేదా గ్లూకోజ్‌ స్ధాయిలు నియంత్రించబడటం జరిగింది. అధ్యయనంలో పాల్గొన్న దాదాపు ఒక వంతు (23.3%)మందిలో బ్లడ్‌ షుగర్‌ సాధారణ స్ధాయికి చేరుకుంది.

Taiwan: ఉద్యోగులకు ఐదేళ్ల జీతం బోనస్‌గా ఇవ్వబోతున్న కంపెనీ.. ఏ కంపెనీయో తెలుసా?

ఈ రెండు అధ్యయనాలలోనూ 60 మంది ప్రజలు 20 గ్రాముల బాదములు(0.7 ఔన్స్‌)ను అంటే చిన్న గుప్పెడు పరిమాణంలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్నర్‌కు అరగంట ముందు ఈ అధ్యయన కాలంలో తిన్నారు. ఈ బాదముల అధ్యయన ఫలితాలను వెల్లడించేందుకు పూర్తి ఉత్సాహం కనబరిచిన పరిశోధకులు, మొట్టమొదటిసారిగా గణాత్మకంగా గణనీయంగా ప్రీ డయాబెటీస్‌ స్ధాయిలను తగ్గడం తాము చూశామని, డైట్‌ ద్వారా ప్రీ డయాబెటీస్‌ను తగ్గించడాన్ని ‘హోలీ గ్రెయిల్‌ ఆఫ్‌ మెడిసన్‌’గా పిలుస్తున్నామన్నారు. అత్యుత్తమంగా గ్లూకోజ్‌ నియంత్రణ, డైటరీ వ్యూహాలైనటువంటి బాదములను ఆహారంలో జోడించడం వల్ల మధుమేహం వృద్ధి చెందకుండా అడ్డుకోవడమూ సాధ్యమైంది. దాదాపు 70% మంది వ్యక్తులు తమ జీవితకాలంలో మధుమేహులుగా మారే అవకాశాలున్నాయి.

Delhi Budget2023: బీజేపీ నేతల్ని ఉద్దేశించి కేజ్రీవాల్ అంత మాటనేశారేంటి?

నిర్వహించిన ఈ రెండు అధ్యయనాలూ ర్యాండమైజ్డ్‌ కంట్రోల్డ్‌ ట్రయల్స్‌. వీటికి ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా నిధులను సమకూర్చింది. అధ్యయనకారులు వెల్లడించే దాని ప్రకారం,ప్రీ లోడింగ్‌ అంటే ముఖ్యమైన మీల్స్‌కు ముందు బాదములు తీసుకోవడం వల్ల గ్లూకోజ్‌ స్థాయి తగ్గడంతో పాటుగా ఇన్సులిన్‌ ఒడిదుడుకులు సైతం భోజనం తరువాత తగ్గుతుంది. మొత్తంమ్మీద నియంత్రతి డైట్‌తో పోల్చినప్పుడు హైపర్‌గ్లెసెమియా తగ్గుతుంది. ఈ అధ్యయనంలో కనుగొన్న అంశాలు విభిన్నమైన వ్యక్తులపై చేసిన అధ్యయనాలను కాంప్లిమెంట్‌ చేస్తున్నాయి. సమతుల ఆహారంలో భాగంగా బాదములు తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన స్థాయిలో బ్లడ్‌ షుగర్‌ సాధ్యమవుతుందని ఆ అధ్యయనాలు వెల్లడించాయి.