Taiwan: ఉద్యోగులకు ఐదేళ్ల జీతం బోనస్‌గా ఇవ్వబోతున్న కంపెనీ.. ఏ కంపెనీయో తెలుసా?

ఒక కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు ఏకంగా ఐదేళ్ల వేతనాన్ని బోనస్‌గా అందించబోతుంది. తైవాన్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీ ఎవర్‌గ్రీన్ మెరైన్ అనే సంస్థ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని 3,100 మంది ఉద్యోగులకు వారి పనితీరు ఆధారంగా ఈ బోనస్ అందిస్తామని చెప్పింది. ఈ వేతనాల కోసం కంపెనీ మొత్తంగా 94 మిలియన్ డాలర్లను వెచ్చించబోతుంది.

Taiwan: ఉద్యోగులకు ఐదేళ్ల జీతం బోనస్‌గా ఇవ్వబోతున్న కంపెనీ.. ఏ కంపెనీయో తెలుసా?

Taiwan: బోనస్ అనగానే సాధారణంగా ఏ కంపెనీ అయినా ఒక నెల లేదా రెండు నెలల జీతాన్ని అదనంగా ఇస్తుంది. కొన్నిసార్లు ఉద్యోగుల పనితీరు, కంపెనీ లాభాల ఆధారంగా కూడా బోనస్ ఇస్తారు. కానీ, ఒక కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు ఏకంగా ఐదేళ్ల వేతనాన్ని బోనస్‌గా అందించబోతుంది.

Rafael Nadal: టాప్-10లో చోటు కోల్పోయిన రఫెల్ నాదల్.. 2005 తర్వాత ఇదే తొలిసారి

తైవాన్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీ ఎవర్‌గ్రీన్ మెరైన్ అనే సంస్థ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. గత డిసెంబర్‌లోనే తమ ఉద్యోగులకు 50 నెలల బోనస్ ప్రకటించిన సంస్థ, మరోసారి ఐదేళ్ల వేతనాన్ని బోనస్‌గా అందించబోతున్నట్లు ప్రకటించింది. కంపెనీలోని 3,100 మంది ఉద్యోగులకు వారి పనితీరు ఆధారంగా ఈ బోనస్ అందిస్తామని చెప్పింది. ఈ వేతనాల కోసం కంపెనీ మొత్తంగా 94 మిలియన్ డాలర్లను వెచ్చించబోతుంది. మిడ్ ఇయర్ బోనస్‌గా దీన్ని అందించబోతున్నట్లు కంపెనీ తెలిపింది. సాధారణంగా ఈ కంపెనీలో ఒక్కొక్కరి వార్షిక వేతం 29,545 డాలర్ల నుంచి 1,14,823 డాలర్ల వరకు ఉంది. గత డిసెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 14.7 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది.

Srinivas Goud: లక్షల కోట్లు దోచుకున్న వారిని వదిలేసి ఆడబిడ్డను వేధిస్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప్రతి సంవత్సరం లాభాల్లో పెరుగుదల 39.82 శాతంగా ఉంది. ఎవర్‌గ్రీన్ మెరైన్ కంపెనీ రెండేళ్లక్రితం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. సూయెజ్ కాలువలో ఈ కంపెనీకి చెందిన ఓడ చిక్కుకుపోయింది. దీంతో రెండు వైపులా రవాణా నిలిచిపోయింది. రెండు వైపులా పడవలు రోజుల తరబడి ఆగిపోయాయి. దీనివల్ల అనేక దేశాలకు సరుకుల రవాణా ఆగిపోయింది. ఈ సమస్య పరిష్కారానికి చాలా రోజులు పట్టింది. ఎవర్‌గ్రీన్ మెరైన్ సంస్థ షిప్పింగ్ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

అయితే, ఈ సంస్థ ఇలా లాభాలు ప్రకటించడంపై ఇతర కంపెనీలు విమర్శలు చేస్తున్నాయి. ప్రస్తుతం అనేక కంపెనీలు నష్టాల్ని ఎదుర్కొంటున్నాయని, ఈ సంస్థ చర్యల వల్ల నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. ఎవర్‌గ్రీన్ మెరైన్ సంస్థ షేర్లు కూడా గత ఏడాది కొంత వరకు తగ్గాయి.