గురువులకు వందనాలు….ఘనంగా వరల్డ్ టీచర్స్ డే సెలబ్రేషన్స్

నేడు వరల్డ్ టీచర్స్ డే. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. 1996 నుంచి యునెస్కో అధికారికంగా వరల్డ్ టీచర్స్ డేని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం టీచర్స్‌డే నినాదం.. యంగ్ టీచర్స్: ది ఫూచర్ ఆఫ్ ది ప్రొఫెషన్. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉపాధ్యాయులు చేసేందుకు ప్రోత్సహించాలి. ఉపాధ్యాయునికి గల ప్రాముఖ్యతను, వారి సేవలను చిన్నారులకు తెలియజేయాలి.
యూనెస్కో.. యూనిసెఫ్, ఎన్‌డీపీ, ఎడ్యుకేషనల్ ఇంటర్నేషనల్ భాగస్వామ్యంతో టీచర్స్‌డేను అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా యూనెస్కో ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రపంచానికి స్ఫూర్తినిచ్చేది టీచరే. చిన్నారి విద్యార్థులను భావితరాలకు భాద్యతాయుతమైన పౌరులుగా, ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. జీవితంలో ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.
ప్రస్తుతం విద్య సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతోందనీ, ఉపాధ్యాయులు.. ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రైవేటు విద్యావిధానానికి అనుగుణంగా విద్యార్థులకు అన్ని రకాల మెళకువలు, సాంకేతిక పరిజ్ఞానం అందించాలని యునెస్కో ట్వీట్ చేసింది. అయితే భారత్‌లో సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే.