Old Man
Oldest Living Man: నిండు నూరేళ్లు జీవించాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యల కారణంగా అందరికీ అది సాధ్యపడకపోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మారుతున్న జీవన ప్రమాణాలు, ఇతర ఆహారపు అలవాట్ల కారణంగా మనుషులు ఆయుర్ధాయం తగ్గిపోయింది. వందేళ్లు బ్రతకడం అనేది ఈరోజుల్లో చెప్పుకోవాల్సిన విషయంగా మారగా..అంతకు మించి మరో పదేళ్లు బ్రతికే ఉన్నవారిని గిన్నిస్ రికార్డుకెక్కిస్తున్నారు. ఇక విషయంలోకి వస్తే..ప్రపంచంలో అత్యధిక వయస్కుడిగా వెనెజులాకు చెందిన జువాన్ విసెంటె పెరెజ్ మోరా అనే వృద్ధుడు మే 27న తన 113వ పుట్టినరోజు జరుపుకున్నాడు. పెరెజ్ కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కలిసి భారీ ఎత్తున పుట్టినరోజు వేడుక జరిపారు. అయితే తన జీవిత రహస్యం పై పెరెజ్ మాట్లాడుతూ రోజూ ఒక గ్లాస్ నాటు సారా(స్థానికంగా దొరికే షుగర్ కేన్ హూచ్ అనే బ్రాందీ) తాగడమే అంటూ చెప్పుకొచ్చాడు.
other stories: Carolina Reaper: ఘాటైన మిర్చి.. కరోలినా ర్యాపర్ తినడంలో గిన్నిస్ రికార్డ్
వెనెజులాలో చెరుకు నుంచి తయారు చేసే ఒక రకమైన ద్రావణాన్ని కొద్దిగా ఆల్కహాల్ జోడించే తయారు చేసేదే ఈ షుగర్ కేన్ హూచ్. ఉదయం నిద్ర లేవడంతోనే ఒక కప్పు కాఫీతో దినచర్య ప్రారంభించే పెరెజ్..పని అనంతరం సాయంత్రం వేళ ఒక గ్లాసు నాటు సారా సేవించేవాడు. ప్రస్తుతం వృద్ధాప్యం కారణంగా వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మినహా జువాన్ విసెంటె పెరెజ్ మోరాకు మరే ఇతర అనారోగ్య సమస్యలు లేవని అతని వైద్యులు చెప్పుకొచ్చారు. ఇక మే 27న 113వ పుట్టినరోజు జరుపుకున్న జువాన్ విసెంటె పెరెజ్ మోరాకు 41 మంది మనవళ్ళు, మానవరాండ్రు, 18 మంది ముని మనవళ్లు, 12 మంది ముని ముని మనవళ్లు ఉన్నారు. మొత్తం నాలుగు తరాల వ్యక్తులను జువాన్ విసెంటె పెరెజ్ మోరా తన జీవిత కాలంలో చూడగలిగారు.
other stories: UN human rights: ఐరాస మానవ హక్కుల బృందం చైనాలో స్వేచ్ఛగా పర్యటించలేదు: అమెరికా