Carolina Reaper: ఘాటైన మిర్చి.. కరోలినా ర్యాపర్ తినడంలో గిన్నిస్ రికార్డ్

కరోలినా ర్యాపర్.. ఏంటీ ఇది అనుకుంటున్నారా? ఇదో మిరపకాయ రకం. ప్రపంచంలోనే అత్యంత కారం, ఘాటు కలిగిన మిరప కాయ ఇదే. దీన్ని తినాలంటే చాలా కష్టం. నోట్లో పెట్టుకోగానే ఘాటు నషాలానికి అంటుతుంది.

Carolina Reaper: ఘాటైన మిర్చి.. కరోలినా ర్యాపర్ తినడంలో గిన్నిస్ రికార్డ్

Carolina Reaper

Carolina Reaper: కరోలినా ర్యాపర్.. ఏంటీ ఇది అనుకుంటున్నారా? ఇదో మిరపకాయ రకం. ప్రపంచంలోనే అత్యంత కారం, ఘాటు కలిగిన మిరప కాయ ఇదే. దీన్ని తినాలంటే చాలా కష్టం. నోట్లో పెట్టుకోగానే ఘాటు నషాలానికి అంటుతుంది. కారంతో విలవిల్లాడిపోవడం ఖాయం. కడుపులో మంటతోపాటు కొన్నిసార్లు ఒళ్లంతా చెమటలు పట్టి, ముఖమంతా ఎర్రగా మారుతుంది.

monkeypox: ‘మంకీపాక్స్’.. మరో ‘కరోనా’ అవుతుందా?

అలాంటి మిరపకాయ ఒక్కటి తిని తట్టుకోవడమే కష్టం అనుకుంటే.. అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా మూడు మిరపకాయలు తిన్నాడు. అది కూడా తొమ్మిది సెకండ్లలోపే. దీంతో అతడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఫోస్టర్ అనే వ్యక్తి కరోలినా ర్యాపర్ తినడంలో రికార్డు నెలకొల్పాలనుకున్నాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో రికార్డు కోసం ప్రయత్నించాడు. ముందుగా ఆరు కరోలినా ర్యాపర్స్‌ తిన్నాడు. అయితే, నిర్దిష్ట సమయంలోగా తిన్నప్పటికీ, వాటికి సంబంధించి ఇంకా కొంత భాగం నోట్లో మిగిలే ఉంది. దీంతో ఈ రికార్డును అనర్హమైనదిగా ప్రకటించారు నిర్వాహకులు. తర్వాత మరోసారి రికార్డు కోసం ప్రయత్నించాడు. ఈ సారి మూడు కరోలినా ర్యాపర్స్ తిన్నాడు. అది కూడా 8.72 సెకండ్లలోనే పూర్తిగా తినేశాడు. దీంతో ఫోస్టర్‌కు అతి తక్కువ సమయంలో మూడు కరోలినా ర్యాపర్ మిరపకాయలు తిన్నందుకుగాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

Nepal plane: నేపాల్‌లో విమానం అదృశ్యం.. ప్రయాణికుల్లో భారతీయులు

ఇంతకుముందు ఈ రికార్డు కెనడాకు చెందిన మైక్ జాక్ అనే వ్యక్తి పేరు మీద ఉండేది. అతడు 9.72 సెకండ్లలో మూడు మిరపకాయలు తిన్నాడు. కరోలినా ర్యాపర్ మిరపకాయలు చాలా ఘాటుగా ఉండటం వల్ల అవి తిన్న తర్వాత అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. వీటిని తిని రికార్డు నెలకొల్పాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అయితే, వీటిని తినడం వల్ల వచ్చే రికార్డులు, రివార్డుల కన్నా.. కలిగే నష్టమే ఎక్కువగా ఉంటుంది.