చైనాకు బుద్ధి వచ్చింది.. వుహాన్‌లో కస్టమర్లు లేక మాంసం దుకాణాలు వెలవెల 

  • Publish Date - April 17, 2020 / 06:46 AM IST

కరోనా వైరస్ అంటించిన పాపం ఊరికే పోతుందా? చైనాలోని వుహాన్ సిటీలో అతిపెద్ద ఫుడ్ వెట్ మార్కెట్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తితో వుహాన్
సిటీకి తాళం పడింది. లాక్ డౌన్ దెబ్బకు వెట్ మార్కెట్లు మూతపడ్డాయి. వైరస్ రాక ముందు కస్టమర్లతో కళకళలాడిన మాంసం దుకాణాలన్నీ గిరాకీ లేక నిర్మూనుష్యంగా
మారాయి. ప్రపంచానికి కరోనా వైరస్ అంటించిన వుహాన్ సిటీలోని వెట్ మార్కెట్లపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆహారం కోసం అడవి జంతువుల మాంసాన్ని విక్రయించడాన్ని చైనా ప్రభుత్వం నిషేధించింది.

కానీ, ఇతర దేశాల్లో కరోనా వ్యాప్తి చెందుతున్నప్పటికీ కూడా వుహాన్ సిటీలో వెట్ మార్కెట్లను తిరిగి తెరవడంపై విమర్శలు వస్తున్నాయి. దీర్ఘకాలిక క్వారంటైన్ సమయంలో వుహాన్ సీటీలో వెట్ మార్కెట్లను ఏప్రిల్ 8 వరకు మూతపడింది. ఇప్పుడు వెట్ మార్కెట్లు తిరిగి తెరుచుకున్నాయి. కానీ, అప్పట్లో వచ్చినంతగా కస్టమర్లు రాకపోవడంతో సిటీ మార్కెట్లు రద్దీ లేక విలవిలబోతున్నాయి. లాక్ డౌన్ కు ముందు మూడో వంతు సేల్స్ పడిపోయాయని వెట్ మార్కెట్లోని యాంగ్ అనే దుకాణాదారుడు వాపోయాడు. వెట్ మార్కెట్లలో ఇతర దుకాణాలు తెరుచుకున్నప్పటికీ ఒక మార్కెట్ మాత్రం ఇంకా మూతపడే ఉంది. హ్యునాన్ సీఫుడ్ మార్కెట్ తెరుచుకోలేదు.

ఇక్కడి మార్కెట్లో అడవి జంతువుల మాంసాన్ని ఎక్కువగా విక్రయిస్తుంటారు. ఇక్కడి నుంచే కరోనా వైరస్ ఉద్భవించిందని, జంతువుల నుంచి మనుషుల్లోకి పాకిందని అనుమానిస్తున్నారు. వెట్ మార్కెట్లలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో ఫ్రెష్ మీట్, వెజిటేబుల్స్, ఫిష్ వంటివి ఆసియాలో ప్రధానంగా కొనుగోలు చేస్తుంటారు. ప్రతిరోజు అక్కడి స్థానికుల కోసం తక్కువ ధరకే అందిస్తుంటారు. బతికి ఉన్న జంతువులను విక్రయించనప్పటికీ కూడా కొన్ని దుకాణాల్లో విక్రయిస్తుంటారు.

ఈ వారమే వుహాన్ మార్కెట్లలో AEP సందర్శించింది. ఈ సందర్భంగా బతికి ఉన్న తాబేళ్లు, కప్పలు, చేపలు, జలచరాలను సేల్ కోసం ఉంచారు. గతంలో వ్యాధులను వ్యాప్తి చేసిన క్షీరదాలు, పక్షులను విక్రయించారు. Baishazhou మార్కెట్లోని వర్కర్లంతా తమ స్టాల్స్ వద్ద శుభ్రతను పాటిస్తున్నారు. రోజులో ఎక్కువ సార్లు తమ దుకాణాలను శానిటైజ్ చేస్తున్నారు. మాస్క్ లతో పాటు వైరస్ సోకకుండా ఉండేలా కెమికల్స్ స్ప్రేలను కూడా వాడుతున్నారు.  

ఈ వారమే వెట్ మార్కెట్లను తిరిగి తెరుస్తున్నామనే నిర్ణయాన్ని ఆస్ట్రేలియన్ ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. ఇలాంటి రకమైన ప్రాణాంతక కరోనా వైరస్‌ల నుంచి
ప్రపంచాన్ని రక్షించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్లోకి వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గిపోయింది. మార్కెట్లోకి వెళ్లేందుకు ఒకే ఎంట్రీ
ఉండేలా ఏర్పాట్లు చేసింది. కస్టమర్లు మార్కెట్లోకి వెళ్లాలంటే ముందుగా వారి శరీర ఉష్ణోగ్రతతో పాటు ఇతర అరోగ్య విషయాలను అడిగి తనిఖీ చేస్తున్నారు. అనుమానం వస్తే
వెంటనే వారిని క్వారంటైన్ కు అధికారులు తరలిస్తున్నారు.