US Alabama Fight: నదిఒడ్డున ఫైటింగ్.. ఆడ, మగ తేడాలేకుండా కుర్చీలతో బాదుకున్నారు.. ఎందుకో తెలుసా? వీడియోలు వైరల్

మహిళలుసైతం ఈ కొట్లాటలో పాల్గొన్నారు. మహిళలు, పురుషులు అనే తేడాలేకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

WWE style fight

WWE Style Fight: నది ఒడ్డున రెండు వర్గాల వారు కొట్టుకున్నారు. ఆడ, మగ అనే తేడాలేకుండా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఆఖరికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తరహాలో మడత కుర్చీలతో బాదుకున్నారు. ఒళ్లు గగురుపొడిచే తరహాలో జరిగిన ఈ కొట్లాట అచ్చం మనం టీవీల్లో చూసే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ను తలపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ఓ వ్యక్తి మడత కుర్చీతో మహిళను తలపై కొట్టడం కనిపించింది. అంతేకాదు.. మహిళలుసైతం తగ్గేదే లేదంటూ కొట్లాటలో పాల్గొన్నారు. ఈ ఘటన అమెరికాలోని అలబామాలో ఓ నది ఒడ్డున చోటు చేసుకుంది.

woman viral video : చీరకట్టుతో రోమ్ వీధుల్లో తిరిగిన భారతీయ మహిళ.. మంత్రముగ్ధులైన ఇటాలియన్లు

యూఎస్ టుడే వివరాల ప్రకారం.. అలబామాలోని ఓ నది ఒడ్డున కొంతమంది విహారానికి వెళ్లారు. రివర్ ఫ్రంట్ పార్కులో సెక్యూరిటీ గార్డుపై కొంతమంది పర్యటకులు దాడిచేసినట్లు వీడియోలో కనిపించింది. చూస్తుండగానే జాతి వివక్షతతో చిన్నపాటి ఘర్షణ రెండు వర్గాలు కొట్లాటగా మారిపోయింది. నది ఒడ్డుకు పర్యాటకులు బోటును నిలిపారు. అయితే, కొద్దిసేపటి తరువాత తీరానికి పెద్ద బోటు వస్తుందని, దానిని తొలగించాలని అక్కడి సెక్యూరిటీ గార్డు పర్యటకులకు సూచించాడు. దీంతో ఆగ్రహించిన కొందరు వ్యక్తులు సెక్యూరిటీ గార్డుతో ఘర్షణకు దిగారు. అతనిపై దాడిచేశారు. ఇదే సమయంలో సెక్యూరిటీ గార్డుకు మద్దతుగా కొందరు వచ్చారు. దీంతో ఘర్షణకాస్తా ముదిరి నల్ల జాతీయ, శ్వేతజాతీయల మధ్య భీకర పోరాటానికి దారితీసింది.

Viral Video : వామ్మో.. కిచిడీ కోసం.. పొట్టు పొట్టు కొట్టుకున్న టీచర్, వంట మనిషి.. వీడియో వైరల్

మహిళలుసైతం ఈ కొట్లాటలో పాల్గొన్నారు. మహిళలు, పురుషులు అనే తేడాలేకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మడత కుర్చీని తీసుకొచ్చి అక్కడే ఉన్న మహిళ తలపై దాడిచేశాడు. ఈ ఘటన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.  ఇరు వర్గాల మధ్య ఘర్షణతో ఆ ప్రాంతంలో ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న మాంట్‌గోమేరీ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వారి ఘర్షణను అడ్డుకున్నారు. అయితే, ఇందులో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఘటనపై విచారణ జరుపుతున్నామని, ఘర్షణకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

 

ట్రెండింగ్ వార్తలు