Viral Video : వామ్మో.. కిచిడీ కోసం.. పొట్టు పొట్టు కొట్టుకున్న టీచర్, వంట మనిషి.. వీడియో వైరల్

నువ్వెవరు నన్ను అడగటానికి అంటూ టీచర్ తో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అంతే, ఇద్దరూ కొట్టుకున్నారు. Viral Video

Viral Video : వామ్మో.. కిచిడీ కోసం.. పొట్టు పొట్టు కొట్టుకున్న టీచర్, వంట మనిషి.. వీడియో వైరల్

Viral Video - Teacher Cook Fight

Viral Video – Teacher Cook Fight : మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కిచిడీ విషయం చోటు చేసుకున్న వివాదం కొట్టుకునే వరకు వెళ్లింది. టీచర్, వంట మనిషి జట్లు పట్టుకుని మరీ దారుణంగా కొట్టుకున్నారు. ఇద్దరూ పొట్టు పొట్టు తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బీడ్ మండలం ధరూర్ తాలూకాలోని జోడ్ హింగానీ జిల్లా పరిషత్ పాఠశాలలో షాకింగ్ ఘటన జరిగింది. స్కూల్ టీచర్, వంట మనిషి ఘర్షణ పడ్డారు. పిల్లల కోసం వండే కిచిడీ వీరి మధ్య చిచ్చు రాజేసింది. కిచిడీ నాణ్యంగా లేదని ఆరోపిస్తూ వంట మనిషితో టీచర్ వాదించింది. అంతే కాకుండా స్కూల్ ఆవరణలో వంటమనిషి భర్త షాప్ పెట్టడాన్ని టీచర్ ప్రశ్నించింది. ఈ విషయంలో వంట మనిషి కూడా రెచ్చిపోయింది. నువ్వెవరు నన్ను అడగటానికి అంటూ టీచర్ తో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అంతే, ఇద్దరూ కొట్టుకున్నారు. ఒకరి జట్టు మరొకరు పట్టుకుని పొట్టు పొట్టు తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

జోడ్ హింగాని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 4వ తరగతి వరకు 60 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా, పిల్లలకు పెట్టే కిచిడీ విషయంలో నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి. కిచిడీ నాణ్యంగా లేదని పిల్లలు టీచర్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఉపాధ్యాయురాలు వంట మనిషిని కోరింది. కిచిడీ ఎందుకు నాణ్యంగా ఉండటం లేదని ప్రశ్నించింది. అంతే, ఒక్కసారిగా వివాదం రాజుకుంది. నువ్వెవరు? నన్ను అడగటానికి అంటూ వంట మనిషి రెచ్చిపోయింది. టీచర్ పై దాడికి దిగింది.

స్కూల్ ఆవరణలోనే పిల్లల ముందే వారిలా కొట్టుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. టీచర్, వంట మనిషి జట్లు పట్టుకుని కొట్టుకోవడాన్ని చూసి పిల్లలు భయపడిపోయారు. ఇంతలో అక్కడే ఉన్న మహిళలు అతి కష్టం మీద వారిద్దరినీ విడదీశారు. ఇద్దరికీ సర్ది చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. కాగా.. అది స్కూల్ అన్న సంగతిని, అక్కడ పిల్లలున్నారు అనే విషయాన్ని మర్చిపోయి ఇద్దరూ ఇలా దిగజారిపోవడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు.