Real Life Barbie : రియల్ లైఫ్ బార్బీలా కనిపించడానికి రూ. లక్ష డాలర్లు ఖర్చుపెట్టింది

బార్బీ డాల్ లాగ కనిపించడానికి ఓ యువతి లక్ష డాలర్లు ఖర్చుపెట్టింది. వరుసగా సర్జరీలు చేయించుకుంటూనే ఉంది. అందం ఇనుమడింపచేసుకునేందుకు ఎన్ని చికిత్సలకైనా సిద్ధమంటోంది.

Barbie Doll Jasmine Forest : అందానికి మెరుగులు దిద్దుకునేందుకు  అమ్మాయిలు డబ్బులు ఖర్చుపెడతారు. అయితే ఓ ఆస్ట్రేలియన్ మహిళ ‘రియల్ లైఫ్ బార్బీ’ గా కనిపించడానికి రూ.లక్ష డాలర్లు ఖర్చుపెట్టింది.

Human Barbie: లక్షలు ఖర్చుచేసి హ్యూమన్ బార్బీగా మారిన యువతి.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే?

ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్‌కు చెందిన 25 ఏళ్ల జాజ్మిన్ ఫారెస్ట్ అనే అమ్మాయి నిజజీవితంలో బార్బీ యువరాణి కావాలనుకుంది. రియల్ లైఫ్ బార్బీలాగ కనిపించడానికి $100,000 ( రూ. 82,82,950.00 ఇండియన్ కరెన్సీలో) ఖర్చుపెట్టింది. 18 సంవత్సరాల వయసులోనే ఆమె మొదటి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చికిత్స చేయించుకుంది. ఆమె బుగ్గలు, గడ్డం, దవడ మరియు అందానికి ఇంజెక్షన్లు చేయించుకుంది.

 

24 సంవత్సరాల వయస్సులో బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడానికి మరోసారి ఆమె కడుపు, చేతులు, తొడలు, వీపు పైనా కింద, గడ్డం మరియు ముఖానికి వాసర్ లైపోసక్షన్ చేయించుకుంది. ఇటీవల దక్షిణ కొరియాలోని సియోల్‌‌లో జాస్మిన్ ఫారెస్ట్ ఎక్కువసార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది, రినోప్లాస్టీ ద్వారా నుదురు తగ్గించుకునే చికిత్స తీసుకుంది.  ప్లాస్టిక్ సర్జరీలు తనకి ఇష్టం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లోని తన అకౌంట్‌ jazmynforrest1 లో  పోస్ట్ కూడా పెట్టింది.

Rs.16 crores to reduce age : 45 ఏళ్ల వ్యక్తి 18 లాగ కనపడటానికి ఏడాదికి రూ.16 కోట్లు ఖర్చుపెడుతున్నాడు

చిన్నప్పటి నుంచి తాను ఇలాంటి చికిత్సలు తీసుకోవాలని అనుకున్నట్లు ఆమె చెబుతోంది. తన అందాన్ని పెంచుకునేందుకు ఫ్యూచర్‌లో మరిన్ని చికిత్సలు తీసుకునేందుకు వెనుకాడబోను అని కూడా చెబుతోంది. తన రూపాన్ని మార్చుకోవడంలో వెనక్కి తగ్గేదేలే అంటున్న జాజ్మిన్‌ని చూసి జనాలకు నవ్వాలో ఏడ్వాలో అర్ధం కావట్లేదట.

ట్రెండింగ్ వార్తలు