Human Barbie: లక్షలు ఖర్చుచేసి హ్యూమన్ బార్బీగా మారిన యువతి.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే?

జర్మనీకి చెందిన జెస్సీ జన్నీ అనే యువతి హ్యూమన్ బార్బీగా మారింది. ఇందుకోసం ఆమె రూ. 53.60(70వేల డాలర్లు) చెల్లించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్టు చేసింది...

Human Barbie: లక్షలు ఖర్చుచేసి హ్యూమన్ బార్బీగా మారిన యువతి.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే?

Human Barbie

Human Barbie: జర్మనీకి చెందిన జెస్సీ జన్నీ అనే యువతి హ్యూమన్ బార్బీగా మారింది. ఇందుకోసం ఆమె రూ. 53.60(70వేల డాలర్లు) చెల్లించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్టు చేసింది. జెస్సీ జన్నీ జర్మనీకి చెందిన యువతి. హ్యూమన్ బార్బీగా మారాలన్నది ఆమె కోరిక. తన కలను నిజం చేసుకోవాలన్న ఆశతో తన సొంత కుటుంబాన్ని వదిలి ఆస్ట్రేలియాలోని వియోన్నాకు వచ్చేసింది. 21 ఏళ్ల జెస్సీ ఇందుకోసం ఆమె 70వేల డాలర్లు ఖర్చు చేసింది. వృక్షోజాలాలు, పిరుదులు, పెదాలకు మూడు సార్లు శస్త్ర చికిత్స చేయించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. గతంలో ఆమె ఫొటోలు, ప్రస్తుతం శస్త్ర చికిత్స అనంతరం ఆమె ఫోస్టలను ఇందులో పోస్టు చేసింది.

Human Barbie 1

హ్యూమన్ బార్బీగా మారాలన్న కోరిక 17ఏళ్ల వయస్సులోనే కలిగిందని జెస్సీ బన్నీ తెలిపింది. తన తల్లిదండ్రులు, కుటుంబంలో చాలా సంప్రదాయాలు ఉంటాయని చెప్పింది. తనకు హ్యూమన్ బార్బీగా మారాలన్న కోరికను 17ఏళ్ల వయస్సులోనే తల్లిదండ్రులకు తెలియజేశానని, కానీ వారు ఒప్పుకోకపోవటంతో పలు సార్లు మనస్పర్థలు వచ్చాయని అన్నారు. తన కోరికను నెరవేర్చుకొనే ప్రయత్నంలో తన తల్లిదండ్రులను వదిలేసి వచ్చినట్లు జెస్సీ తెలిపింది. అయితే తన మొదటి రొమ్ము శస్త్రచికిత్సకు తన తల్లి, తండ్రి నుండి డ్రైవింగ్ నేర్చుకోవడానికి అని చెప్పి డబ్బులు తీసుకొని, వాటితో మొదటి రొమ్ము మెరుగుదల చేయించుకున్నానని, తనకు అపారమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని ఆమె తెలిపింది.

Rahul gandhi: ఎవరీ సుమ్మిమా ఉదాస్..? ఆమెతో రాహుల్‌కున్న సంబంధమేంటి?

అప్పుడు తన మొత్తం శరీరాన్ని బార్బీ డాల్ గా మార్చాలని యోచిస్తోన్నట్లు తెలిపింది. నా తల్లిదండ్రులతో మాట్లాడేందుకు పలుసార్లు ప్రయత్నించారని, ఫోన్లు చేసినప్పటికీ వారు తన ఫోన్ ను ఎత్తలేదని తెలిపింది. పూర్తిగా తన నెంబర్ ను బ్లాక్ చేశారని, టెక్స్ట్ మెస్సేజ్ పెట్టినా స్పందించలేదని తెలిపింది. ముఖ్యంగా నా సోదరుడు, నా తాతలతో కలిసి ఉండాలని ఉన్నా, నేను నా శారీరక రూపాన్ని మార్చుకున్నందున వారు ఎందుకు అలా ప్రవర్తిస్తారో నాకు అర్థం కాలేదు జెస్సీ అన్నారు.