Rahul gandhi: ఎవరీ సుమ్మిమా ఉదాస్..? ఆమెతో రాహుల్‌కున్న సంబంధమేంటి?

రాహుల్ గాంధీ నేపాల్ పర్యటన దేశంలో రాజకీయ దుమారానికి కారణమైంది. నేపాల్‌లోని ఓ నైట్‌క్లబ్‌కు రాహల్ వెళ్లినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో...

Rahul gandhi: ఎవరీ సుమ్మిమా ఉదాస్..? ఆమెతో రాహుల్‌కున్న సంబంధమేంటి?

Summida

Rahul gandhi: రాహుల్ గాంధీ నేపాల్ పర్యటన దేశంలో రాజకీయ దుమారానికి కారణమైంది. నేపాల్‌లోని ఓ నైట్‌క్లబ్‌కు రాహల్ వెళ్లినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా చెప్పుకొనే వ్యక్తి నైట్‌క్లబ్‌లలో తిరగడమేంటని బీజేపీ నిలదీస్తుంది. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దీటుగా కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ నైట్‌క్లబ్‌లో ఓ యువతితో ఉన్నట్లు కనిపించింది. ఇంతకీ ఆ యువతి ఎవరన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Rahul Gandhi: రాహుల్ నైట్ పార్టీ.. కాంగ్రెస్, బీజేపీ ట్విట్టర్ వార్

రాహుల్‌తో నైట్‌క్లబ్‌లో ఉన్న వ్యక్తి సుమ్మిమా ఉదాస్. ఆమె నేపాలీ మహిళ. సుమ్మిమా ఉదాస్ అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ ఇంటర్నేషనల్‌కు ఢిల్లీ ప్రతినిధిగా పనిచేసింది. ఈ క్రమంలో దేశంలో కీలక రాజకీయ పరిణామాలతో పాటు ఆర్థిక, సామాజిక, పర్యావరణ తదితర రంగాలపై అనేక ఆసక్తికర కథనాలు ఇచ్చారు. అంతేకాదు.. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసుతో పాటు మలేషియా విమానం కుప్పకూలడం, కామన్వెల్త్ అవినీతి కుంభకోణం తదితర అంశాలపై ప్రముఖంగా ఆమె కథనాలు రాశారు. అంతేకాక 2014 భారత్ సాధారణ ఎన్నికలను కూడా కవర్ చేశారు. ఆమె తండ్రి భీమ్ ఉదాస్ దౌత్య అధికారిగా పనిచేశారు. మయన్మార్ లో నేపాల్ రాయబారిగా సేవలందించారు. దీంతో ఆమె చిన్నప్పటి నుంచి దాదాపు 10 దేశాల్లో ఉన్నారు. వర్జినియాలోని వాషింగ్టన్ అండ్ లీ యూనివర్శిటీలో బ్రాడ్ కాస్ట్ జర్నలిజంలో బ్యాచిలర్ చేసిన ఉదాస్.. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

Rahul Gandhi: నేపాల్ పబ్‌లో రాహుల్ గాంధీ ఖుషీ ఖుషీ: దుమ్మెత్తిపోస్తున్న బీజేపీ నేతలు

సుమ్మిమా ఉదాస్ రాహుల్ కు స్నేహితురాలు. సుమ్మిమా ఉదాస్ వివాహం ఈనెల 5న జరగనుంది. ఈ వివాహానికి హాజరయ్యేందుకే రాహుల్ గాంధీ కాఠ్‌మాండూ వెళ్లారు. అయితే ఈ విషయంపై సుమ్నిమా తండ్రి, మయన్మార్‌లో నేపాలీ మాజీ రాయబారి భీమ్ ఉదాస్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని సుమ్నిమా వివాహానికి ఆహ్వానించామని తెలిపారు. వివాహం మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగిందని, గురువారం రిసెప్షన్ జరుగుతుందని తెలిపారు.