IPL 2020: కోల్‌కతాపై చెన్నై విజయంతో లాభపడ్డ నాలుగు జట్లు!

  • Published By: vamsi ,Published On : October 30, 2020 / 01:08 PM IST
IPL 2020: కోల్‌కతాపై చెన్నై విజయంతో లాభపడ్డ నాలుగు జట్లు!

గెలుపు అంటే నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి అంటారు కదా? అటువంటి గెలుపే చెన్నై కొల్‌కత్తాపై గెలిచింది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌కత్తా జట్టును కూడా దాదాపు ఒక్క విజయంతో తప్పిపోయే స్థితిలోకి తీసుకుని వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం కారణంగా టోర్నమెంట్లో ఈక్వేషన్‌లు మొత్తం మారిపోయాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై కోల్‌కతాపై చివరి బంతి విజయం అందుకుంది. ఈ విజయం వల్ల చెన్నై సూపర్ కింగ్స్‌ కాకుండా మరో నాలుగు జట్లు కూడా లాభపడ్డాయి.



చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుండి ఎలిమినేట్ అయిపోగా.. ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చెన్నై విజయం కారణంగా లబ్ది పొందాయి.



ప్లేఆఫ్‌కు చేరుకున్న ముంబై ఇండియన్స్:
కోల్‌కతాపై చెన్నై విజయం సాధించడం వల్ల ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ సీజన్ 13లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. అంతకుముందు బుధవారం ముంబై బెంగళూరుపై విజయం నమోదు చేయగా.. ప్లే ఆఫ్ అర్హత అయితే సాధించలేదు. అయితే చెన్నై మ్యాచ్‌లో కోల్‌కత్తా ఓటమితో జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.



పంజాబ్‌కు ప్లేఆఫ్స్‌కు చేరుకునే మార్గం సుగమం:
చెన్నై విజయం తరువాత, పంజాబ్ ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం పంజాబ్ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. కోల్‌కతా జట్టు చెన్నైపై గెలిచి ఉంటే, ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి పంజాబ్ తీవ్రంగా పోరాడాల్సి వచ్చేది. ఇప్పుడు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి పంజాబ్ రెండు మ్యాచ్‌లను గెలిస్తే చాలు.. పంజాబ్ తన రెండు మ్యాచ్‌లలో ఒకదాన్ని పెద్ద తేడాతో గెలిస్తే కూడా ప్లేఆఫ్‌లో అర్హత సాధిస్తుంది.



హైదరాబాద్‌కు కూడా మంచే జరిగింది:
ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)పై విజయాన్ని సాధించినా.. చెన్నైతో మ్యాచ్‌లో కోల్‌కత్తా ఓడిపోక పోతే.. హైదరాబాద్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యేవి. పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరో స్థానంలో ఉండగా.. టేబుల్ టాపర్స్ అయిన ముంబై మరియు బెంగళూరు జట్లతో మాత్రమే హైదరాబాద్‌కు మ్యాచ్‌లు ఉన్నాయి. హైదరాబాద్ రెండింటినీ గెలవాలి అప్పుడు హైదరాబాద్ 14పాయింట్లకు చేరుతుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒకదాన్ని కోల్పోయి, ఒకదాన్ని గెలిస్తే.. SRH నెట్ రన్‌రేట్ +0.396 ఇది ముంబై తర్వాత అన్ని జట్లలో అత్యధికం. సన్‌రైజర్స్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుతుంది. కోల్‌కత్తా కూడా వారి ఒక మ్యాచ్లో ఓడిపోయి, తక్కువ పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. అటువంటి పరిస్థితిలో, వారు 14 పాయింట్లను పొందుతారు మరియు తరువాత నెట్ రన్‌రేట్ ప్రకారం ప్లేఆఫ్‌లోకి ప్రవేశించవచ్చు.



ప్లే ఆఫ్‌కు చేరువగా బెంగళూరు:
చెన్నై గెలుపుతో బెంగళూరు కూడా లాభపడింది. ఇప్పుడు బెంగళూరు వారి మిగిలిన మ్యాచ్‌లను గెలిచి ప్లేఆఫ్‌లోకి ప్రవేశించాల్సిన అవసరం లేదు. మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోయినా నెట్ రన్‌రేట్ కారణంగా వారు ప్లే ఆఫ్ రేసులోనే ఉంటారు.



రాజస్థాన్ రాయల్స్‌కు కష్టమే:
చెన్నై గెలుపుతో రాజస్థాన్ జట్టు కూడా లాభపడింది. కానీ జట్టు ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచ్‌లను మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. ప్రస్తుతం రాజస్థాన్ 10 పాయింట్లతో 7 వ స్థానంలో ఉంది. చేతిలో రెండు మ్యాచ్‌లు ఉన్నాయి.

పాయింట్ల పట్టిక: