Indian Premier League
Glenn Maxwell : ఐపీఎల్ 2021 పదో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బెంగళూరు బ్యాట్స్ మెన్ మాక్స్ వెల్ దుమ్ము రేపాడు. కోల్ కతా బౌలర్లను చీల్చిచెండాడు. చెత్త బంతులను బౌండరీకి తరలించాడు. ఇతడిని అవుట్ చేయడానికి కోల్ కతా బౌలర్లు శ్రమించారు. చివరకు కమిన్స్ బౌలింగ్ లో మాక్స్ (78) పెవిలియన్ చేరాడు. నాలుగో బ్యాట్స్ మెన్ గా వచ్చిన మాక్స్ 49 బంతులను ఎదుర్కొని 78 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్స్ లున్నాయి. ఇతనికి పడిక్కల్ చక్కటి సహకారం అందించాడు.
తొలుత టాస్ నెగ్గిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లీ, పడిక్కల్ ఓపెనర్లుగా వచ్చారు. కానీ..కెప్టెన్ కోహ్లీ (5) పరుగులు చేసి త్వరగానే అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన పాటిదార్ (1) కూడా తొందరగానే అవుట్ కావడంతో వారి శిబిరంలో ఆందోళనలు మొదలయ్యాయి. వీరిద్దరినీ వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. అయితే..పరిస్థితిని పూర్తిగా మార్చివేశాడు మాక్స్ వెల్. పడిక్కల్, మాక్స్ లు కోల్ కతా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ప్రధానంగా మాక్స్ తన బ్యాట్ కు పని చెప్పాడు.
బంతులను బౌండరీలకు తరలిస్తూ..హాఫ్ సెంచరీ సాధించి కొరకరాని కొయ్యగా మారాడు. ఈ క్రమంలో..ఇతడికి చక్కటి సహకారం అందిస్తూ..వచ్చిన పడిక్కల్ (25)ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేశాడు. కమిన్స్ బౌలింగ్ లో మాక్స్ వెల్ (78) వెనుదిరిగాడు. ఏబీ డివిలియర్స్ 43, కైల్ జేమిసన్ 0 క్రీజులో ఉన్నారు. కోల్ కతా జట్టులో వరుణ్ చక్రవర్తి రెండు, ప్రసిద్ధ కృష్ణ, కమిన్స్ తలా ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పో్యిన బెంగళూరు జట్టు 161 పరుగులు చేసింది.
Read More : RCB vs KKR, Match Preview: కోల్‌కతా గెలుస్తుందా? బెంగళూరు హ్యాట్రిక్ కొడుతుందా?