RCB vs KKR, Match Preview: కోల్‌కతా గెలుస్తుందా? బెంగళూరు హ్యాట్రిక్ కొడుతుందా?

RCB vs KKR, Match Preview: కోల్‌కతా గెలుస్తుందా? బెంగళూరు హ్యాట్రిక్ కొడుతుందా?

Rcb Vs Kkr, Match Preview

Bangalore vs Kolkata, 10th Match – ఐపీఎల్ 2021 యొక్క 10 వ మ్యాచ్ ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మధ్యాహ్నం 3గంటల 30నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది. చెన్నైలోని ఎంఐ చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనుంది. ఈ సీజన్‌లో కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ రెండు మ్యాచ్‌లను కైవసం చేసుకోగా.. అదే సమయంలో, కోల్‌కతా మొదటి మ్యాచ్‌లో గెలిచి రెండవ మ్యాచ్‌లో ఓడిపోయింది.

ఈ క్రమంలోనే హ్యాట్రిక్ విజయంతో ముందు ఉండాలని పట్టుదలగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్‌పై కోల్‌కత్తా గెలిచేనా? అనేది ప్రశ్నే. ఈ సీజన్‌లో మధ్యాహ్నం ఆడబోయే మొదటి మ్యాచ్ ఇదే. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ జట్టు బ్యాటింగ్‌లో బలంగా ఉండగా, కోల్‌కతా బౌలింగ్‌లో బలంగా ఉంది.

కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌కు ముందు కరోనా నెగెటివ్‌గా ఉండడంతో ఆర్‌సిబి ఆల్ రౌండర్ డేనియల్ శామ్స్ జట్టులో చేరేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవడం మాత్రం కష్టమే. మరోవైపు మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యంతో గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ఓడిన కోల్‌కతా.. ఈ మ్యాచ్‌లో బలమైన బెంగళూరును ఎలా ఢీ కొట్టబోతోందో చూడాలి.

పిచ్:
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ ఈ సంవత్సరం భిన్నంగా ప్రవర్తిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలమైన ఈ పిచ్.. రెండవ ఇన్నింగ్స్‌లో చాలా నెమ్మదిగా ఉంది. హైదరాబాద్, ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఇదే కనిపించింది. ఈ మ్యాచ్ పగటిపూట జరుగుతుంది కాబట్టి ఈ మ్యాచ్‌లో మంచు పడే అవకాశం లేదు. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు.

మ్యాచ్ అంచనా:
ఈ మ్యాచ్‌లో కోల్‌కతాదే పైచేయిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బెంగళూరుతో పోలిస్తే కోల్‌కతా బ్యాటింగ్ విభాగం బలహీనంగా ఉన్నప్పటికీ, బౌలింగ్‌లో కోల్‌కత్తా గట్టిగా ఉంది. అటువంటి పరిస్థితిలో, ఈ సీజన్లో RCB వారి మొదటి ఓటమి చూసినా చూడవచ్చు.

రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో కోల్‌కత్తా 14మ్యాచ్‌లు గెలవగా.. బెంగళూరు 12మ్యాచ్‌లను గెలిచింది.

కోల్‌కతా నైట్ రైడర్స్: (Probable XI)- Nitish Rana, Shubman Gill, Rahul Tripathi, Eoin Morgan(c), Andre Russell, Dinesh Karthik(w), Shakib Al Hasan, Pat Cummins, Harbhajan Singh, Prasidh Krishna, Varun Chakravarthy

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: (Probable XI)- Virat Kohli(c), Devdutt Padikkal, Shahbaz Ahmed, Glenn Maxwell, AB de Villiers(w), Washington Sundar, Daniel Christian, Kyle Jamieson, Harshal Patel, Mohammed Siraj, Yuzvendra Chahal