KL Rahul : విరాట్ కోహ్లీ రికార్డు బద్దలుకొట్టిన రాహుల్
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టులో చేరినప్పటి నుంచి పూర్తిగా మారిపోయాడు. ఆ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక పరుగుల వరద పారిస్తున్నాడు. గతేడాది(2020) యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ లో రాహుల్ 670 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తాజాగా రాహుల్ మరో ఘనత సాధించాడు.

Kl Rahul Breaks Virat Kohli's Record
KL Rahul Breaks Virat Kohli’s Record : టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టులో చేరినప్పటి నుంచి పూర్తిగా మారిపోయాడు. ఆ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక పరుగుల వరద పారిస్తున్నాడు. గతేడాది(2020) యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ లో రాహుల్ 670 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తాజాగా రాహుల్ మరో ఘనత సాధించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 5వేల పరుగుల మార్క్ చేరుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్ నిలిచాడు. 143 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను చేరుకోగా.. కోహ్లీ 167 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.
ఐపీఎల్‌లో రాహుల్ 76 ఇన్నింగ్స్‌ల్లో 2వేల 808 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 91 పరుగులతో రాహుల్ విజృంభించిన విషయం తెలిసిందే. కాగా, ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటివరకు 187 ఇన్నింగ్స్‌ల్లో 5వేల 949 రన్స్ చేశాడు.