ఉమెన్స్ టీ20లో ఏ జట్టు గెలిచినా మంచిదే: నీతా అంబానీ

ఉమెన్స్ టీ20లో ఏ జట్టు గెలిచినా మంచిదే: నీతా అంబానీ

Updated On : April 9, 2021 / 1:08 PM IST

WOMEN CRICKET: ఉమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్)2020లో భాగంగా షార్జా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన ట్రయల్ బ్లేజర్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఈ ఫైనల్‌మ్యాచ్‌కు ముందు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కీలక కామెంట్లు చేశారు. ఫైనల్‌ పోరులో ఎవరు గెలిచినా అది ఔత్సాహిక మహిళా క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో మహిళల క్రికెట్‌కు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేశారు నీతా అంబానీ. ముఖ్యంగా క్రీడా, విద్యా రంగాల్లో లేడీస్‌ను ప్రోత్సహించడమే కాకుండా.. అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నీతా పేర్కొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్‌ తరపున బాలికలు అందరికీ విద్య, క్రీడా అవకాశాలు అందించాలనేదే ధ్యేయమని ఆమె అన్నారు.



మౌలిక వసతులు, సదుపాయాలతోపాటు, అవకాశాలు, నైపుణ్య శిక్షణ అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు. లీగ్‌లో 33 మంది ఇండియన్స్‌తోపాటు, 12 మంది విదేశీ మహిళా క్రికెటర్లు జియో విమెన్‌​ 2020లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే తొలిసారి థాయ్‌లాండ్‌ నుంచి నాథకాన్‌(24) పాల్గొంటున్నారని నీతా అంబానీ తెలిపారు.

క్రీడల్లో బాలికల ప్రోత్సాహం కోసం నవీముంబైలో జియో క్రికెట్‌ స్టేడియాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సరైన అవకాశాలు కల్పిస్తే, గ్లోబల్‌గా రాణిస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించారని నీతా ప్రశంసించారు. టీమిండియా మహిళల క్రికెట్‌ జట్టు.. ఆరేళ్లుగా అంజుం చోప్పా, జులన్‌గోస్వామి, మిథాలీ రాజ్‌లాంటి లెజెండ్లు మంచి పేరు సంపాదించారన్నారు. స్మృతి మంధాన, పూనమ్ యాదవ్‌, హర్మన్ ప్రీత్‌కౌర్‌ మహిళా క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళుతున్నారని చెప్పారు. భవిష్యత్తులోమరింత రాణించనున్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.