BPCL Recruitment 2026 : డిగ్రీ పాస్ అయితే చాలు.. BPCLలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,000 జీతం
BPCL Recruitment 2026 : నిరుద్యోగులకు బీపీసీఎల్ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
bpcl recruitment 2026 notification for 250 engineering accounts and qa posts Full details here
BPCL Recruitment 2026 : మీరు డిగ్రీ పాస్ అయ్యారా.. మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిలో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి రెడీ అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 250 సెక్రటరీ, జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆసక్తిగల అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్, అకౌంట్స్, క్యూఏ, అఫీషియల్ లాంగ్వేజ్ విభాగాల్లో భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అర్హత కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి నెలకు ప్రారంభ వేతనం రూ.30,000-రూ.1,40,000 వరకు ఉండనుంది.
పోస్టుల వివరాలు..
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్) పోస్టుల సంఖ్య: 175
- అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ అస్యూరెన్స్) పోస్టుల సంఖ్య: 30
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్) పోస్టుల సంఖ్య: 25
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (వేసైడ్ ఎమినిటీస్) పోస్టుల సంఖ్య: 10
- సెక్రటరీ (బీపీసీఎల్) పోస్టుల సంఖ్య: 08
- అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్) పోస్టుల సంఖ్య: 02
విద్యార్హత
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్, బీఈ, సీఏ, సీఎంఏ, ఎంఏ, ఎంఎస్సీ ఏదైనా ఒక డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే నోటిఫికేషన్లో సూచించిన విధంగా సంబంధిత విభాగాల్లో గతంలో పని చేసిన అనుభవం కూడా ఉండాలి.
వయసు
పోస్టులను బట్టి అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 2026, ఏప్రిల్ 1వ తేదీ నాటికి 30-35 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం
ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ
ఆసక్తిగల అభ్యర్థులు మే 17, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు
దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం
రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
వేతనం
పోస్టును బట్టి నెలకు రూ.30,000 నుంచి రూ.1,40,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
