CIL Notification 2026 : జాబ్ అంటే ఇదిరా సామీ.. పరీక్ష లేదు.. నెలకు రూ.2 లక్షల వరకు జీతం.. ఈ అర్హతలుంటే చాలు.. !

CIL Notification 2026 ప్రభుత్వ ఉద్యోగం కోసం చూసేవారికి పండగలాంటి వార్త. నెలకు రూ.2 లక్షల వరకు జీతం పొందే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేసన్ విడుదలయ్యింది. రాత పరీక్ష లేకుండా వీటిని భర్తీ చేయనున్నారు.

coal india limited notification 2026 for 276 management trainee posts apply online details here

CIL Notification 2026 : మంచి జాబ్, అందునా ప్రభుత్వ కొలువు కోసం ఎదురుచూసే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం వచ్చే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పైగా రాత పరీక్ష లేకుండా ఎంపిక చేయనుంది. ఇంక ఇంతకంటే మంచి ఛాన్స్ వస్తుందా.. అందుకే త్వరపడండి! ఇంతకీ ఈ ఉద్యోగాలు ఏ విభాగంలో భర్తీ చేస్తున్నారంటే.. కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) – మైనింగ్ విభాగంలో. ఈ డిపార్ట్‌మెంట్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టులను భర్తీ చేయనున్నారు.

*విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొత్త రూల్.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే డబ్బులు రావు..

ఈ క్రమంలో తాజాగా కోల్‌కతా CIL అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. పరీక్ష లేదంటే మరి ఎలా ఎంపిక చేస్తారంటే.. గేట్ (GATE) 2025 స్కోర్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు శుక్రవారం, మే 8 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

అర్హతలు:

ఈ మేనేజ్‌మెంట్ ట్రైనీ (మైనింగ్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు

  • మైనింగ్ ఇంజినీరింగ్‌లో బీఈ (BE) లేదా బీటెక్ (B.Tech) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు ఉండాలి.
  • ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
  • దీనితో పాటు గేట్ 2025 పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

వయసు:

  • అభ్యర్థుల వయసు ఏప్రిల్ 30, 2026వ తేదీ నాటికి 30 ఏళ్లకు మించకూడదు.
  • ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వరకు వయోసడలింపు ఉంటుంది.

దరఖాస్తు తేదీ:

పైన పేర్కొన్న అర్హతలు కలిగిన అభ్యర్థులు.. జూన్ 7, 2026వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫీజు:

  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు రుసుము కింద రూ. 1,180 చెల్లించాల్సి ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూడి మరియు కోల్ ఇండియా ఉద్యోగులకు ఎలాంటి ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ:

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను గేట్ 2025 స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
  • షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

వేతనం:

  • ఎంపికైన వారికి శిక్షణ కాలంలో నెలకు రూ. 60,000 చొప్పున చెల్లిస్తారు.
  • శిక్షణ విజయవంతంగా పూర్తయ్యాక నెలకు రూ. 1,80,000 వరకు జీతంగా చెల్లిస్తారు.