Student Dead: అమ్మాయి కోసం విద్యార్థుల ఘర్షణ.. ఒకరు మృతి

కాలేజీలో ఒక అమ్మాయి విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఒక విద్యార్థి మరణించాడు. మరో విద్యార్థి గాయపడ్డాడు. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బుధవారం జరిగింది.

Student Dead: అమ్మాయి కోసం విద్యార్థుల ఘర్షణ.. ఒకరు మృతి

Student Dead

Updated On : June 1, 2022 / 9:38 PM IST

Student Dead: కాలేజీలో ఒక అమ్మాయి విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఒక విద్యార్థి మరణించాడు. మరో విద్యార్థి గాయపడ్డాడు. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఖల్సా కాలేజీలో ఒక అమ్మాయి విషయంలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఇది క్రమంగా పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో కాలేజీ గేటు వద్ద ఒక గ్రూప్ విద్యార్థులు, మరో గ్రూప్ విద్యార్థులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులకు బుల్లెట్టు గాయాలయ్యాయి. వీరిలో ఒక విద్యార్థి మరణించాడు. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది.

biggest plant: ఆస్ట్రేలియా తీరంలో అతిపెద్ద మొక్క.. ఎన్ని కిలోమీటర్లో తెలుసా..!

మృతుడిని బాటాలాకు చెందిన లవ్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించారు. గాయపడ్డ విద్యార్థిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. కాలేజీ ప్రాంగణంలోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించి, నిందితులను గుర్తిస్తామని చెప్పారు.