Chhattisgarh: బైక్ హారన్ ఇచ్చినా తప్పుకోలేదని దివ్యాంగుడిని పొడిచి చంపిన బాలిక
బైక్ హారన్ ఇచ్చినప్పటికీ పక్కకు తప్పుకోని ఒక దివ్యాంగుడిపై దాడికి పాల్పడిందో బాలిక. అంతేకాదు.. కత్తితో పొడిచి అతడ్ని హత్య చేసింది. అయితే, అతడికి చెవులు వినిపించవు. మాటలు కూడా రావు.
- Narender Thiru
- Published On : July 24, 2022 / 09:37 PM IST
Chhattisgarh
Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లో దారుణం జరిగింది. దివ్యాంగుడిని రోడ్డుపైనే పొడిచి చంపిందో బాలిక. ఈ ఘటన రాజధాని రాయ్‌పూర్‌లోని ఆజాద్ చౌక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదహారేళ్ల బాలిక బైక్‌పై వెళ్తుండగా, దివ్యాంగుడైన ఒక వ్యక్తి సైకిల్‌పై అదే దారిలో వెళ్తున్నాడు.
Son Murdered By Father: కొడుకును చంపి ముక్కలుగా నరికిన తండ్రి.. తప్పించుకునేందుకు ఏం చేశాడంటే
అతడికి చెవులు వినిపించకపోవడంతోపాటు, మాటలు కూడా రావు. సైకిల్ వెనకాల బైక్ నడుపుతూ వస్తున్న ఆ బాలిక హారన్ మోగించింది. అయితే, అతడికి వినపడకపోవడంతో హారన్ మోతకు స్పందించలేదు. పక్కకు తప్పుకోలేదు. దీంతో కోపం తెచ్చుకున్న ఆ బాలిక ఆ దివ్యాంగుడిపై దాడి చేసింది. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడి మెడపై పొడిచింది. వెంటనే అతడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలిక కోసం వెతికారు.
Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే: రాజ్‌నాథ్ సింగ్
మందిర్ హసౌద్ ప్రాంతంలో బాలికను అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గరి నుంచి కత్తి స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బాలికను జువైనల్ జస్టిస్ బోర్డుకు తరలిస్తామని ఎస్పీ పటేల్ తెలిపారు.
