Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే: రాజ్‌నాథ్ సింగ్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే అని పునరుద్ఘాటించారు దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. జమ్మూలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే: రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh

Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే అని పునరుద్ఘాటించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా జమ్మూలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే అన్నారు.

Lal Darwaja Bonalu: హైదరాబాద్ బోనాల్లో ఘర్షణ.. కర్రలతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు

‘‘ఇప్పటికీ, ఎప్పటికీ పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే. దీనిపై పార్లమెంట్లో ఎప్పుడో తీర్మానం చేశాం. దీనికి కట్టుబడి ఉన్నాం. శివుడి రూపమైన బాబా అమర్ నాథ్ దేశంలో ఉంటే.. శారదా శక్తి మాత లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) వద్ద ఎలా ఉంటుంది? నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు 1962లో లదాఖ్‌ను చైనా ఆక్రమించింది. నెహ్రూ ఉద్దేశాల్ని నేను ప్రశ్నించను. ఆయన ఉద్దేశాలు మంచివే కావొచ్చు. కానీ, ఆ ఉద్దేశాలు నెరవేరలేదు. ఏదైతేనేం.. ఇప్పుడు భారత్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం. కార్గిల్ విజయం మనం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే విషయాన్ని నేర్పింది.

Ladakh Standoff: భారత్‌ను రెచ్చగొడుతున్న చైనా.. జాగ్రత్తగా బదులిస్తున్న భారత్

భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కునేందుకు సిద్ధమవ్వాలి. దశాబ్దాలుగా పాకిస్తాన్ మన దేశంలో రక్తపాతం సృష్టించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ మన సమగ్రతను, ఐకమత్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని దేశ సైనికులు నిరూపించారు. మన దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చడమే మన సైనికులకు ఇచ్చే నివాళి’’ అని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.