Crude Bomb Blast
Crude Bomb Blast: నాటు బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో సోమవారం ఉదయం జరిగింది. ముర్షిదాబాద్ జిల్లా, శక్తిపూర్ ప్రాంతంలోని కుమ్రిపూర్ గ్రామంలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బాంబులు చుడుతున్న మునాయ్ షేఖ్, యూసుఫ్ షేఖ్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
PM Modi: శత్రువులు ఊహించలేని ఆయుధాలు మా దగ్గరున్నాయి: ప్రధాని మోదీ
మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకున్నారు. ఇది బాంబు పేలుడు వల్లే జరిగింది. అయితే ఇరు వర్గాల మధ్య నెలకొన్న భూవివాదమే బాంబుల తయారీకి కారణమని పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం ఒక భూమికి సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ప్రత్యర్థి వర్గాన్ని బెదిరించడానికి ఒక వర్గం బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఈ పేలుడు జరిగింది. మృతులు ఇద్దరూ వేరే గ్రామానికి చెందిన వాళ్లు. బాంబుల తయారీ కోసం ఇక్కడికి వచ్చారు. రెండు రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండోసారి. ఆదివారం కూడా పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఇలాగే పేలుడు జరగడంతో ఇద్దరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 5న కూడా ముర్షీదాబాద్ జిల్లాలోనే మరో పేలుడు జరిగింది.
Nupur Sharma: అరెస్టుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నుపుర్ శర్మ
ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన కూడా రెండు వర్గాల మధ్య ఘర్షణ వల్లే జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ ప్రాంతంలో వర్గాల మధ్య విబేధాలతో ప్రత్యర్థి వర్గాన్ని ఎదుర్కోవడానికి నాటు బాంబులు తయారు చేస్తున్నారు. అయితే, ఇలా నాటు బాంబుల పేలుడు ఘటనలు జరుగుతుండటంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తమ నివాస ప్రాంతాల్లోనే వీటి తయారీ సాగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసు అధికారులు వీటిని అరికట్టాలని కోరుతున్నారు.