Nupur Sharma: అరెస్టుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నుపుర్ శర్మ

జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలా ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ నుపుర్ శర్మ పిటిషన్‌పై విచారణ జరపనుంది. అలాగే ఆమె వ్యాఖ్యల తర్వాత జరిగిన హత్య, అల్లర్లు వంటి పరిణామాలకు నుపుర్ శర్మనే బాధ్యురాలు అంటూ సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Nupur Sharma: అరెస్టుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నుపుర్ శర్మ

Nupur Sharma

Nupur Sharma: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుల విషయంలో తనను అరెస్టు చేయకుండా స్టే విధించాలని కోరుతూ నుపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై రేపు (మంగళవారం) విచారణ జరగనుంది.

PM Modi: శత్రువులు ఊహించలేని ఆయుధాలు మా దగ్గరున్నాయి: ప్రధాని మోదీ

జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలా ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ నుపుర్ శర్మ పిటిషన్‌పై విచారణ జరపనుంది. అలాగే ఆమె వ్యాఖ్యల తర్వాత జరిగిన హత్య, అల్లర్లు వంటి పరిణామాలకు నుపుర్ శర్మనే బాధ్యురాలు అంటూ సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకోవాలి అని నుపుర్, సుప్రీంకోర్టును కోరింది. సోమవారం సాయంత్రం ఈ అంశాలపై తాజాగా ఆమె సుప్రీంను ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులన్నింటినీ ఢిల్లీలోనే విచారించేలా చూడాలని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమెపై మొదటి కేసు ఢిల్లీలోనే నమోదైంది. ఇప్పటివరకు నుపుర్ శర్మపై తొమ్మిది కేసులు నమోదయ్యాయి.

Rahul Gandhi: ఉద్యోగాలు లేవు కానీ ట్యాక్సులు మాత్రం ఎక్కువ.. కేంద్రంపై రాహుల్ విమర్శలు

వాటన్నింటిపైనా అరెస్టు చేయకుండా స్టే విధించాలని, ఒకే చోట విచారించాలని ఆమె కోరుతోంది. మరోవైపు నుపుర్ వ్యాఖ్యల తర్వాత ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది. ఇప్పటికే ఆమెను హత్యతోపాటు, అత్యాచారం చేస్తామని పలు బెదిరింపులు వస్తున్నాయి. గత నెలలో నుపుర్ చేసిన వ్యాఖ్యల తర్వాత దేశవ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.