PM Modi: శత్రువులు ఊహించలేని ఆయుధాలు మా దగ్గరున్నాయి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీలో సోమవారం భారత నావికా దళం (నేవీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన సైనిక శక్తిని ప్రశంసించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆత్మనిర్భరత మన రక్షణ రంగానికి ఎంతో మేలు చేస్తుందన్నారు.

PM Modi: శత్రువులు ఊహించలేని ఆయుధాలు మా దగ్గరున్నాయి: ప్రధాని మోదీ

Pm Modi

PM Modi: శత్రువులు కనీసం ఊహించలేని ఆయుధాలు మన జవాన్ల దగ్గర ఉన్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. న్యూఢిల్లీలో సోమవారం భారత నావికా దళం (నేవీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన సైనిక శక్తిని ప్రశంసించారు.

Presidential Elections: ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. 21న ఫలితాలు

కేంద్రం తీసుకొచ్చిన ఆత్మనిర్భరత మన రక్షణ రంగానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ‘‘ఒకప్పుడు మనం చిన్నచిన్న విషయాలకు కూడా విదేశాలపై ఆధారపడే వాళ్లం. డ్రగ్స్‌కు అలవాటు పడినట్లుగా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అలవాటు పడిపోయాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని, గతాన్ని పరిశీలించి 2014లో కొత్త మిషన్ ప్రారంభించాం. రక్షణ రంగంలో ఆత్మనిర్భరతపై దృష్టి పెట్టాం. ఇది 21వ శతాబ్దంలో మనకు ఎంతో మేలు చేస్తుంది. వచ్చే ఏడాది ఆగష్టు 15కల్లా 75 దేశీయ సాంకేతికతల్ని నేవీకి అందించబోతున్నాం. వందేళ్ల స్వతంత్ర్య భారతంలోపు దేశీయ రక్షణ రంగాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలనేది మా లక్ష్యం. మన దగ్గర ప్రతిభ ఉంది. ప్రపంచంలో అందరి దగ్గరా ఉన్న ఆయుధాలతోనే మేం మా సైన్యాన్ని యుద్ధంలోకి పంపబోం.

Rahul Gandhi: ఉద్యోగాలు లేవు కానీ ట్యాక్సులు మాత్రం ఎక్కువ.. కేంద్రంపై రాహుల్ విమర్శలు

మేం అలాంటి రిస్క్ తీసుకోం. శత్రువులు కనీసం ఊహించలేని ఆయుధాలు మా సైన్యం దగ్గర ఉన్నాయి. కేంద్రం తీసుకున్న చర్యల వల్ల రక్షణ రంగ దిగుమతులు 21 శాతం తగ్గాయి. దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.