Presidential Elections: ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. 21న ఫలితాలు

పార్లమెంట్‌లో 99.18 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ప్రజలకు నేరుగా ఎన్నుకునే అవకాశం ఉండదు. దేశ పార్లమెంట్‌లో ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసన సభ్యులు ఓటు వేసి, రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.

Presidential Elections: ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. 21న ఫలితాలు

Presidential Elections

Presidential Elections: పార్లమెంట్‌తోపాటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. నూతన రాష్ట్రపతి కోసం ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 21న ఫలితం విడుదలవుతుంది. ప్రధాని మోదీతోపాటు అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదులో శివలింగానికి పూజలు.. 21న సుప్రీంకోర్టులో విచారణ

పార్లమెంట్‌లో 99.18 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ప్రజలకు నేరుగా ఎన్నుకునే అవకాశం ఉండదు. దేశ పార్లమెంట్‌లో ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసన సభ్యులు ఓటు వేసి, రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొంటాయి. చట్టసభలకు నామినేటెడ్ పద్ధతిలో ఎంపికైన వారికి ఓటు హక్కు ఉండదు. 21న ఫలితం వెలువడుతుంది. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న రామ్‌నాథ్ పదవీ కాలం ఈ నెల 24తో ముగుస్తుంది. కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి 25న పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. రాష్ట్రపతి పదవీ కాలం ఏదేళ్లు ఉంటుంది. ప్రధాని మోదీతోపాటు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మమతా బెనర్జీ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Rahul Gandhi: ఉద్యోగాలు లేవు కానీ ట్యాక్సులు మాత్రం ఎక్కువ.. కేంద్రంపై రాహుల్ విమర్శలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కోవిడ్ కారణంగా పీపీఈ కిట్ ధరించి ఓటు వేయడం విశేషం. మరోవైపు ఈ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి, ద్రౌపది ముర్ముకు అనుకూలంగా ఓటు వేసినట్లు సమాచారం.